News September 8, 2024

బురద రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: లోకేశ్

image

AP: జనం వరదల్లో ఉంటే జగన్ ప్యాలెస్‌లో రిలాక్స్ అవుతున్నారని మంత్రి లోకేశ్ విమర్శించారు. బురద రాజకీయాలకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని దుయ్యబట్టారు. పాస్‌పోర్ట్ సమస్య లేకుంటే ఎప్పుడో లండన్ వెళ్లేవారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బుడమేరు పనులను నిలిపివేసి విపత్తుకు కారణమైందని మండిపడ్డారు. బుడమేరు ఆధునీకరణకు కూటమి ప్రభుత్వం రూ.464 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

Similar News

News November 1, 2025

10కి తక్కువ లేదా 150కి ఎక్కువ.. ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

image

బిహార్ ఎన్నికల్లో తాము 10 కన్నా తక్కువ లేదా 150 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని జన్ సురాజ్ పార్టీ ఫౌండర్ ప్రశాంత్ కిశోర్ అన్నారు. ‘రాష్ట్ర ప్రజలు మా పార్టీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఎన్డీయేకు, ప్రతిపక్ష కూటమికి ఓటు వేయాలని వారు అనుకోవట్లేదు. 160-170 సీట్లలో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్నికలకు ముందు, తర్వాత ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టంచేశారు.

News November 1, 2025

ఇంటి చిట్కాలు

image

* జిడ్డు పట్టిన గ్యాస్ లైటర్‌కు నిమ్మకాయ ముక్కను, బేకింగ్ సోడాలో అద్ది లైటర్‌పై రాసి మళ్ళీ క్లాత్‌తో తుడిస్తే గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.
* నెయిల్ పాలిష్ క్లీనర్‌తో తుడిస్తే ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులపై మరకలు పోతాయి.
* ఒక కప్పు వేడి నీటిలో 2 చెంచాల వెనిగర్‌ వేసి బాగా కలిపి, వాషింగ్ మెషీన్ మరకలపై స్ప్రే చేసి కాసేపు అలాగే ఉంచాలి. తర్వాత క్లీనింగ్ బ్రష్‌తో శుభ్రం చేస్తే మరకలు ఈజీగా తొలగిపోతాయి.

News November 1, 2025

‘నా మీద జాలి వేయదారా.. నేను చనిపోతే వస్తావా?’

image

AP: విశాఖలో డిగ్రీ స్టూడెంట్ సాయితేజ్(21) <<18165774>>ఆత్మహత్య<<>> కేసులో వాట్సాప్ చాట్ బయటికొచ్చింది. మహిళా లెక్చరర్ పదేపదే అతడికి మెసేజ్‌లు చేస్తూ రిప్లై ఇవ్వడం లేదెందుకని నిలదీసింది. ‘నా మీద జాలి వేయదారా? శైలు చనిపోయినప్పుడు వెళ్లావ్ కదా.. నేను చనిపోతే వస్తావా?’ అంటూ బెదిరింపులకు దిగింది. ‘నువ్వు పిరికి’ అంటూ హేళన చేసింది. ఈ వేధింపులతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పేరెంట్స్ ఆరోపించారు.