News September 8, 2024
జాతీయ రహదారిపై కారులో మంటలు

చిట్యాల పట్టణ శివారులో గల పెట్రోల్ పంపు సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మంటలను గుర్తించి వెంటనే కారును పక్కకు ఆపడంతో ఇద్దరికీ ప్రాణాపాయ తప్పింది. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
Similar News
News December 26, 2025
నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి: జాజుల

నల్గొండ జిల్లాలో బీసీ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో తగిన అవకాశం కల్పించాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు టికెట్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని, నామినేటెడ్ పదవుల ద్వారా భర్తీ చేసి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
News December 26, 2025
సాత్విక పొలిటికల్ ఎంట్రీ.. కోమటిరెడ్డి ఆశీర్వాదం

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన దుబ్బ సాత్విక గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన రాజకీయ ప్రస్థానానికి మద్దతు తెలపాలని కోరుతూ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అందరి సహకారంతో పార్టీ బలోపేతానికి, మహిళా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో ముందుండి పనిచేస్తానని ఈ సందర్భంగా సాత్విక పేర్కొన్నారు.
News December 26, 2025
పేదల పక్షాన శతాబ్ది పోరాటం: ఎమ్మెల్సీ సత్యం

భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా సీపీఐ సాగించిన పోరాటాలు అద్వితీయమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మగ్దూమ్ భవన్‌లో పతాకాన్ని ఆవిష్కరించారు. 1925లో కాన్పూర్‌లో ఆవిర్భవించిన నాటి నుంచి రైతు, కూలీ, అణగారిన వర్గాల హక్కుల కోసం సీపీఐ నిరంతరం పోరాడుతోందని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు.


