News September 8, 2024

వ‌ర‌ద‌ బాధితుల స‌హాయార్ధం రూ.కోటి విలువైన 10 వేల కిట్లు సిద్ధం

image

విజ‌య‌వాడ వ‌ర‌ద బాధితుల‌కు కోసం రూ.కోటి విలువైన 10 వేల నిత్యావసర సరుకుల కిట్లు సిద్ధం చేసిన‌ట్లు మంత్రి టీజీ భ‌ర‌త్, టీడీపీ క‌ర్నూలు జిల్లా అధ్య‌క్షుడు తిక్కారెడ్డి తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జులు, నాయ‌కుల స‌హ‌కారంతో వీటిని తయారు చేసిన‌ట్లు చెప్పారు. ఒక్కో కిట్‌లో 5 కేజీల బియ్యం, కేజీ కందిప‌ప్పు, కేజీ చక్కెర‌, ఉప్మార‌వ్వ‌, కారంపొడి, త‌దిత‌ర వ‌స్తువులు ఉన్నాయన్నారు.

Similar News

News February 12, 2026

అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 5వ తరగతి, 6వ నుంచి 10వ తరగతి మిగులు సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరం (ఆంగ్ల మాధ్యమం) ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ఎంఈ గీతా తెలిపారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. అభ్యర్థులు https://apbragcet.apcfss.in వెబ్‌సైట్‌లో ఈనెల 19లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News February 12, 2026

మహాశివరాత్రి వేళ.. కర్నూలు ఎస్పీ హెచ్చరిక

image

మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. దర్శన టికెట్లు, వసతి గదుల బుకింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదన్నారు. OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని తెలిపారు.

News February 12, 2026

టీచర్ లేకుండా ఎలా పాసవ్వాలి.. విద్యార్థుల ఆవేదన

image

కోడుమూరు జడ్పీ బాలుర పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు కాళీ ఏర్పడింది. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో సైన్స్ టీచర్ లేకపోవడంతో ఏ విధంగా పరీక్షలకు సిద్ధం కావాలో అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. సైన్స్ టీచర్‌ను నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు.