News September 8, 2024

హసీనాను వెనక్కి తీసుకొస్తాం: బంగ్లా

image

భారత్‌లో తలదాచుకున్న తమ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను వెనక్కి రప్పిస్తామని బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్(ఐసీటీ) చీఫ్ ప్రాసిక్యూటర్ మహ్మద్ తైజుల్ ఇస్లామ్ పేర్కొన్నారు. అందుకోసం అవసరమైన చర్యల్ని తీసుకుంటామని మీడియాతో అన్నారు. ‘ఆమె అప్పగింత విషయంలో భారత్‌తో ఉన్న ఒప్పందాలను అనుసరిస్తాం. జులై, ఆగస్టులో విద్యార్థుల నిరసనల సమయంలో సామూహిక హత్యలు చేయించినట్లు హసీనాపై ఆరోపణలున్నాయి’ అని తెలిపారు.

Similar News

News November 3, 2025

ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడి అప్పుల పాలు.. కానిస్టేబుల్ ఆత్మహత్య!

image

TG: పోలీస్ కానిస్టేబుల్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డిలో జరిగింది. కల్హేర్‌కు చెందిన సందీప్ ఏడాదికాలంగా పట్టణ PSలో పనిచేస్తున్నారు. ఈరోజు మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆన్‌లైన్‌ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకున్నారని, సహోద్యోగుల వద్ద అప్పులు చేశారని సమాచారం. డబ్బులు తిరిగివ్వాలని ఒత్తిడి చేయడంతో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

News November 3, 2025

కరెంట్, రోడ్లు అడిగితే చనిపోతారని చెప్పేవాళ్లు: మోదీ

image

దశాబ్దాలపాటు బిహార్‌ను కష్టాల్లో ఉంచిందని ఆర్జేడీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘ఆ పార్టీకి అభివృద్ధి వ్యతిరేక చరిత్ర ఉంది. రోడ్లు నిర్మిస్తే ప్రమాదాలు జరుగుతాయని, కరెంటు సరఫరా చేస్తే షాక్‌కు గురై చనిపోతారని ప్రజలకు ఆర్జేడీ నాయకులు చెప్పేవాళ్లు’ అని విమర్శించారు. నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో సుపరిపాలన అందించామని, రాష్ట్రానికి వందే భారత్ రైళ్లు, రోడ్లు తీసుకొచ్చామని కటిహార్‌లో ఎన్నికల ప్రచారంలో అన్నారు.

News November 3, 2025

రూల్ బ్రేక్ చేస్తే ట్రిపుల్ పెనాల్టీ: మంత్రి పొన్నం

image

TG: ఇరుకు రోడ్డు కావడం, డివైడర్ లేకపోవడం వల్లే చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగిందని మంత్రి పొన్నం తెలిపారు. రవాణా శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ‘ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా కఠినంగా వ్యవహరిస్తేనే యాక్సిడెంట్లను నియంత్రించవచ్చు. వాహనాల స్పీడ్ లాక్ ఎంత వరకు అమలవుతుందో చూడాలి. దాన్ని బ్రేక్ చేస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయాలి. ఫిట్‌నెస్ పర్మిట్లపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి’ అని ఆదేశించారు.