News September 8, 2024
చైనాలో సంస్థ ప్రారంభించిన అదానీ గ్రూప్

చైనాలో సప్లై చెయిన్ సొల్యూషన్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సేవల కోసం అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ(సబ్సిడరీ)ను ప్రారంభించింది. అదానీ ఎనర్జీ రిసోర్సెస్(షాంఘై) కో(AERCL)ను ఈ నెల 2న స్టార్ట్ చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అదనపు వివరాలను మాత్రం పేర్కొనలేదు. కాగా కొన్ని రోజుల క్రితమే కెన్యాలో అదానీ గ్రూపు ఓ సబ్సిడరీని ప్రారంభించింది. ఆ దేశంలో 7 ఎయిర్‌పోర్టుల్ని సంస్థ మేనేజ్ చేస్తోంది.
Similar News
News August 18, 2025
RED ALERT: నేడు అత్యంత భారీ వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
News August 18, 2025
EPFOలో 230 ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ

EPFOలో 230 ఉద్యోగాల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీలో రెండేళ్ల ప్రొబేషన్ ఉంటుంది. లెవెల్-8, లెవెల్-10 వేతన శ్రేణి కింద జీతాలు అందుతాయి. <
News August 18, 2025
ఈ నెల 21న ఓయూకు సీఎం రేవంత్

TG: ఈ నెల 21న సీఎం రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు హాస్టళ్ల భవనాలను ఆయన ప్రారంభిస్తారు. అలాగే రూ.10 కోట్లతో నిర్మించనున్న డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ పనులను కూడా సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో ప్రొఫెసర్లు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ‘సీఎం రీసెర్చ్ ఫెలోషిప్’ పథకాన్ని ప్రారంభిస్తారు.