News September 9, 2024
రంగంలోకి దోవల్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు?

త్వరలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు భారత్ చొరవ తీసుకుంటోంది. ఇందులో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ వారంలో రష్యా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మాస్కోలో పుతిన్‌తో ఆయన సమావేశం అవుతారని సమాచారం. కాగా ఇప్పటికే పుతిన్ శాంతి చర్చలకు అంగీకరించారు. ఇందుకు భారత్ మధ్యవర్తిత్వానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Similar News
News January 31, 2026
బంగారం, వెండి ధరలు తగ్గడానికి ఈయనే కారణం!

బంగారం, వెండి ధరలు కుదేలవ్వడానికి ప్రధాన కారణం కెవిన్ వార్ష్. ఈయన US సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్ కానున్నారు. ట్రంప్ ఆయనను నామినేట్ చేయడంతో మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి. గతంలో ఫెడరల్ రిజర్వ్ గవర్నర్‌గా పనిచేసిన వార్స్ వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా ఉంటారు. డాలర్ బలోపేతానికే పెద్దపీట వేస్తారన్న అంచనాలు ఇన్వెస్టర్లను భయంలోకి నెట్టాయి. భారీగా అమ్మకాలు చేపట్టడంతో ధరలు కుప్పకూలాయి.
News January 31, 2026
మానవ శక్తి కేంద్రాల గురించి తెలుసుకుందామా?

మన శరీరం అనంత శక్తికి నిలయం. ఇందులో వెన్నుపూస వెంబడి 7 శక్తి కేంద్రాలుంటాయి. వీటినే సప్త చక్రాలు అంటారు. ఇవి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని నియంత్రిస్తాయి. ఈ చక్రాలను సమతుల్యం చేయడానికి రత్నాలను ధరించడం, కొన్ని పరిహారాలు పాటించడం ఎంతో మేలు చేస్తుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. వీటిని సమగ్రంగా నిర్వహించకపోతే నష్టం కూడా జరుగుతుందట. వీటి గురించిన పూర్తి వివరాలను మున్ముందు తెలుసుకుందాం.
News January 31, 2026
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ Y పోస్టులు

<


