News September 9, 2024

ఇవాళ ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ప.గో, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. బాపట్ల జిల్లాలోని కొన్ని మండలాలకు హాలిడే ప్రకటించారు. సెలవు ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Similar News

News August 17, 2025

ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నేపథ్యం ఇదే

image

C.P. రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రాపురం పొన్నుస్వామి <<17436465>>రాధాకృష్ణన్<<>>. ఈయన 1957లో తమిళనాడులో జన్మించారు. 16 ఏళ్ల వయసు నుంచే RSS, జన్ సంఘ్‌లో పని చేశారు. 1998, 99లో కోయంబత్తూరు BJP ఎంపీగా గెలిచారు. 2004, 14, 19లో ఓడిపోయారు. 2004-07 వరకు తమిళనాడు BJP అధ్యక్షుడిగా పని చేశారు. 2023లో ఝార్ఖండ్ గవర్నర్‌గా ఎంపికయ్యారు. 2024లో TG గవర్నర్ గానూ అదనపు బాధ్యతలు చేపట్టారు. 2024 జులైలో MH గవర్నర్‌గా నియమితులయ్యారు.

News August 17, 2025

డైరెక్టర్‌గా నాకు నాగార్జున జన్మనిచ్చారు: RGV

image

తల్లిదండ్రులు వ్యక్తిగా తనకు జన్మనిస్తే, ‘శివ’ సినిమాతో డైరెక్టర్‌గా నాగార్జున జన్మనిచ్చారని దర్శకుడు RGV తాజాగా ఓ షోలో అన్నారు. ‘ఆ సమయంలో నేను నమ్మిందే చేయాలని ఆయన పట్టుబట్టారు. అనుభవం లేని నన్ను 100% నమ్మింది నాగార్జునే. పలు సమస్యలు ఎదురైనా నాగ్ నాకు అండగా నిలిచారు’ అని పేర్కొన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘శివ’ టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే.

News August 17, 2025

జీఎస్టీ సంస్కరణలకు సహకరించండి: మోదీ

image

నెక్స్ట్ జనరేషన్ GST సంస్కరణల అమలుకు సహకరించాలని రాష్ట్రాలను ప్రధాని మోదీ కోరారు. ఇందుకు సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే రాష్ట్రాలకు పంపించామని చెప్పారు. ఈ సంస్కరణలు పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు చిన్న, పెద్ద వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుస్తాయని ఓ కార్యక్రమంలో తెలిపారు. ఇవి సుపరిపాలనకు మరింత దోహదం చేస్తాయని, ఈ దీపావళి జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు డబుల్ బోనస్ ఇస్తుందని పేర్కొన్నారు.