News September 9, 2024
పీజీ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి

TG: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీపీగేట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయింది. 21,505 మందికి సీట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 13న సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. అన్ని యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో 99 కోర్సుల్లో సీట్లు కేటాయించారు. అత్యధికంగా ఓయూ పరిధిలో 9వేల మందికి సీట్లు అలాట్ చేశారు.
Similar News
News January 13, 2026
సంక్రాంతి వేళ 12 ప్రత్యేక రైళ్లు.. రిజర్వేషన్ అక్కర్లేదు!

AP: సంక్రాంతి పండుగ నేపథ్యంలో రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా విశాఖ-విజయవాడ మధ్య 12 జన్ సాధారణ్ ట్రైన్స్ నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనున్నట్టు తెలిపింది. జనవరి 12,13,14,16,17,18 తేదీలలో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
News January 13, 2026
ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.
News January 13, 2026
పిల్లలపై పోసిన భోగి పళ్లను తినవచ్చా?

భోగి పళ్లను దిష్టి తీయడానికి పోస్తారు కాబట్టి తినొద్దని కొందరు అనుకుంటారు. అయితే వీటిని తినొచ్చని పండితులు సూచిస్తున్నారు. బదరీ ఫలాలను సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావిస్తారు కాబట్టి తిన్నా ఏ దోషం ఉండదని అంటున్నారు. అయినప్పటికీ అనుమానం ఉన్నా, తినడానికి ఇష్టం లేకపోయినా కొన్ని పండ్లను విడిగా ముందే పక్కకు తీసి పెట్టుకోవాలి. రేగుపళ్లలో సి-విటమిన్ అధికంగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.


