News September 9, 2024

అపరిచితుడు రీమేక్.. విక్రమ్ ఏమన్నారంటే?

image

విక్రమ్ హీరోగా నటించిన ‘అపరిచితుడు’ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేయడంపై ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ స్పందించారు. ఈ సినిమా రీమేక్ గురించి దర్శకుడు శంకర్‌కే తెలుసని చెప్పారు. రణ్‌వీర్ ఈ చిత్రంలో అపరిచితుడు పాత్రలో అద్భుతంగా నటిస్తారని నమ్మకమున్నట్లు తెలిపారు. ఈ రీమేక్‌పై ప్రకటన వచ్చినా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు.

Similar News

News January 13, 2026

డిఫెన్స్ పటిష్ఠతపై కేంద్రం దృష్టి

image

ప్రపంచంలో రాజకీయ అనిశ్చితి, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశ రక్షణ బడ్జెట్‌ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. US సహా పలు దేశాలు ఇప్పటికే డిఫెన్స్‌కు అధిక నిధులు కేటాయిస్తున్నాయి. ఇటు చైనా తన సైనిక శక్తిని విస్తరిస్తోంది. ఈ తరుణంలో మన ’రక్షణ’పై కేంద్రం దృష్టి సారించింది. గత బడ్జెట్లో ₹6.8L CR డిఫెన్స్‌కు కేటాయించింది. ఈసారి అది మరింత పెరగొచ్చని జియోజిత్ ఇన్వెస్టుమెంట్స్ చీఫ్ విజయకుమార్ పేర్కొన్నారు.

News January 13, 2026

EC షెడ్‌లో కోడి పిల్లలను వదిలేముందు పేపర్ వేస్తున్నారా?

image

EC(ఎన్విరాన్‌మెంట్ కంట్రోల్డ్) షెడ్‌లో పొట్టు మీద కోడి పిల్లలను నేరుగా వదలడం మంచిది కాదు. షెడ్‌లో పొట్టు కాస్త పదునుగా ఉండటం వల్ల కోడి పిల్లల కాళ్ల మధ్య గుచ్చుకొని గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ పొట్టుపై కచ్చితంగా పేపర్ వేశాకే చిన్న కోడి పిల్లలను వదలాలి. 1000 పిల్లలకు 5 కేజీల పేపరును పైన వీడియోలో చెప్పిన విధంగా వేయాలి. పేపరు వల్ల కోడి పిల్లలు ఆహారాన్ని సులభంగా గుర్తించి తినగలుగుతాయి.

News January 13, 2026

రబీ మొక్కజొన్నలో కలుపు నివారణ ఎలా?

image

మొక్కజొన్న విత్తిన 48 గంటలలోపు 200 లీటర్ల నీటిలో తేలిక నేలలకు అట్రాజిన్ 800గ్రా, బరువు నేలల్లో 1200 గ్రా. కలిపి నేలపై తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. తర్వాత 25-30 రోజులకు కలుపు ఉద్ధృతిని బట్టి 200 లీటర్ల నీటిలో టెంబోట్రయాన్ 34.4%S.C ద్రావణం 115ml కలిపి కలుపు 3,4 ఆకుల దశలో పిచికారీ చేయాలి. తుంగ సమస్య ఎక్కువుంటే ఎకరాకు 200 లీటర్ల నీటిలో హేలోసల్ఫ్యురాన్ మిథైల్ 75 W.G 36 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.