News September 9, 2024
నెల్లూరు నుంచి శబరిమలకు ఒంటికాలితో యాత్ర

నెల్లూరు నగరానికి చెందిన అక్కరపాక సురేశ్ ఆచారి వికలాంగుడు. అయినప్పటికీ ఒంటికాలితో శబరిమల పాదయాత్ర చేపట్టాడు. ఈ నెల నాలుగవ తేదీన నెల్లూరులో బయలుదేరి పెంచలకోన మీదుగా శబరిమలకు పాదయాత్రగా బయలుదేరాడు. సోమవారం ఆయన పాదయాత్ర నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు చేరుకుంది. ఇలా సురేశ్ ఆచారి ఇదివరకు రెండుసార్లు పాదయాత్ర చేపట్టి మూడవసారి మొక్కు తీర్చుకునేందుకు శబరిమలకు బయలుదేరినట్లు తెలిపారు.
Similar News
News September 16, 2025
నెల్లూరు: డీఎస్సీలో 16 మిగులు సీట్లు

నెల్లూరు జిల్లా నుంచి డీఎస్సీ-2025లో ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 673 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 657 మంది ఎంపికయ్యారు. 16 మిగులు సీట్లు ఉన్నాయి. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.
News September 16, 2025
నెల్లూరు జిల్లాలో ముగ్గురు మహిళా ఆఫీసర్లు

రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లా ఎస్పీగా అజిత వేజెండ్లని నియమించింది. పోలీసు శాఖలో ముగ్గురు మహిళలు ఉన్నత స్థాయిలో ఉండడంతో జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు. అడిషనల్ ఎస్పీగా సౌజన్య ఉండగా.. టౌన్ డీఎస్పీగా సింధుప్రియా ఉన్నారు. అత్యంత సవాళ్లతో కూడుకున్న పోలీస్ శాఖలో మహిళా”మణు”లు బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News September 16, 2025
జిల్లాలో ఏడు మండలాల ఎంపీడీవోలు బదిలీలు

నెల్లూరు జిల్లాలోని 7 మండలాల్లో ఎంపీడీవోలు బదిలీ చేస్తూ జిల్లా ప్రజా పరిషత్ సీఈవో జే మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఉదయగిరి శ్రీనివాసులు, దుత్తలూరు చెంచమ్మ, నెల్లూరు రూరల్ ఎంవీ రవణమ్మ, చేజర్ల ఎలిషా బాబు, సైదాపురం ఎంవీ రామ్మోహన్ రెడ్డి, కలువాయి ఏ శైలజ, వరికుంటపాడు డీవీ రమణారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.