News September 9, 2024

ఆ భయానక ఘటనకు నేటికి నెల రోజులు(1/2)

image

కోల్‌క‌తాలో ట్రైనీ డాక్ట‌ర్‌పై హ‌త్యాచార ఘ‌టన జ‌రిగి సోమ‌వారానికి నెల‌రోజులైంది. ఈ కేసులో ఇప్ప‌టికీ సంజ‌య్ రాయ్ ప్ర‌ధాన నిందితుడిగా ఉన్నాడు. CBI 100 మంది స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసింది. 12 పాలీగ్ర‌ఫీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. RG కర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌పై విమర్శలు రావడంతో ఆయన్ను ఆరెస్ట్ చేసింది. సుమోటోగా విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు వైద్యుల రక్షణపై సలహాలకు టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది.

Similar News

News September 14, 2025

నేడు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం, అనుబంధంగా ద్రోణి విస్తరించిందని APSDMA తెలిపింది. దాని ప్రభావంతో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురవొచ్చని చెప్పింది. శ్రీకాకుళం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షం, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

News September 14, 2025

రూ.29 లక్షల కోట్ల GSDP లక్ష్యం: చంద్రబాబు

image

AP: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 10.5% వృద్ధి సాధించినట్లు CM చంద్రబాబు వెల్లడించారు. ఈనెల 15,16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌పై మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమన్నారు. పౌరసేవలు, సంక్షేమ పథకాలపై పబ్లిక్ పర్సెప్షన్‌ను విశ్లేషిస్తున్నామన్నారు. 2029నాటికి రూ.29 లక్షల కోట్ల GSDP లక్ష్యంగా పనిచేయాలన్నారు.

News September 14, 2025

మీరు ఇలాంటి సబ్బును ఉపయోగిస్తున్నారా?

image

కొందరు ఏది దొరికితే అదే సబ్బుతో స్నానం చేస్తుంటారు. అలా చేయడం వల్ల శరీరానికి హానీ కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రత్యేకంగా సబ్బు వాడాలనుకునేవారు వైద్యుడి సలహా తీసుకోవాలి. కొబ్బరి నూనె, షియా బటర్, కలబంద, తేనె వంటి సహజ పదార్థాలతో చేసిన సోప్ వాడాలి. ఇవి చర్మం, ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవు. రసాయనాలు కలిపిన సబ్బులతో స్నానం చేస్తే చికాకు, ఆందోళన, అనారోగ్యం పాలవుతారు’ అని వారు చెబుతున్నారు.