News September 9, 2024

సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయండి: జిల్లా కలెక్టర్

image

నేడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, నదీ పరిహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా భారీ నష్టాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 08942-2405575) ఫోన్ చేయాలని, అలాగే ఈ-మెయిల్ ఐడీ coskimsupdtd@gmail.com పంపించాలని తెలిపారు.

Similar News

News January 11, 2026

సంతబొమ్మాళి: వేటకెళ్లి మత్స్యకారుడు మృతి

image

సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ దిబ్బలమరువాడ గ్రామానికి చెందిన రామారావు(55) ఆదివారం వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు. తోటి మత్స్యకారులతో సముద్రంలోకి వేటకెళ్లి ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో బోటు బోల్తా పడింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడని తోటి మత్స్యకారులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

News January 11, 2026

శ్రీకాకుళం: ఎస్పీ కార్యాలయంలో ఓబన్నకు నివాళులు

image

స్వాతంత్ర్య సమరయోధుడు, ధైర్య సాహసాలకు ప్రతీక అయిన వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో ఆదివారం వేడుకలు నిర్వహించారు. అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఆయన సేవలను నెమరువేసుకున్నారు.

News January 11, 2026

శ్రీకాకుళం: ‘గుడ్డు ధర’ ఆల్ టైమ్ రికార్డ్

image

శ్రీకాకుళం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్క కోడిగుడ్డు ధర రూ.10 కి చేరింది. హోల్ సేల్ మార్కెట్లోనే ఒక్కో గుడ్డు రూ.9 పలుకుతోంది. గతంలో ఒక ట్రే (30 గుడ్లు) రూ.180- రూ.200 ఉండేవి. ప్రస్తుతం రూ.240- రూ.280కి చేరింది. ఇక నాటు కోడిగుడ్డు రూ.15-20 వరకు పలుకుతోంది. ఈ సీజన్లో ఎగ్స్ ఉత్పత్తి తగ్గి, డిమాండ్ పెరగటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు తెలిపారు.