News September 9, 2024
సగం జీతం సాయం చేసిన తిరుపతి కలెక్టర్

విజయవాడ వరద బాధితులకు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అండగా నిలిచారు. ఈ మేరకు తన సగం జీతాన్ని విరాళంగా ప్రకటించారు. అలాగే డీఆర్వో రూ.25 వేలు వరద బాధితులకు విరాళంగా ఇచ్చారు. భారీ వర్షాలకు అతలాకుతలమైన విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి జిల్లాలోని పలువురు అధికారులు విరాళాన్ని ప్రకటించారు.
Similar News
News January 9, 2026
చిత్తూరు: ‘అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు’

ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలను వసూలు చేస్తే చర్యలు తప్పవని రవాణా ఉప కమిషనర్ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఆయన కార్యాలయంలో బస్సుల యాజమాన్యంతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ను వాయిదా, రద్దు చేయడం తగదన్నారు. ప్రతి బస్సులో సేఫ్టీ పరికరాలు ఉండాలన్నారు.
News January 9, 2026
చిత్తూరు: ‘ఒత్తిడి చేయడంతోనే హత్య’

వివాహ విషయమై ఒత్తిడి చేయడంతోనే కవితను హత్య చేసినట్లు గణేశ్ విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఉత్తిడి మరింత ఎక్కువ అయింది. DEC 31న యల్లమరాజుపల్లె సమీపంలో ఆమెను బైక్‌పై ఎక్కించుకొని GDనెల్లూరు వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. రాత్రి 10.45 గంటలకు ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడిని నీవానది వద్ద పడేశాడు’ అని పోలీసులు తెలిపారు.
News January 9, 2026
క్రీడాకారుడిగా రాణించి.. హత్య కేసులో చిక్కుకుని.!

ముద్దాయి గణేశ్ నేషనల్ లెవెల్ క్రికెటర్. 2021లో దివ్యాంగుల ఐపీఎల్ రాజస్థాన్ రాజ్ వార్స్ టీంకు ఆడాడు. ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ పోటీలలో పాల్గొంటున్నాడు. 2023 సంవత్సరంలో ఇండియన్ ఇంటర్నేషనల్ వికలాంగుల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యి ఇండియా- నేపాల్ మ్యాచ్లోనూ ఆడాడు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.


