News September 9, 2024
లేజర్ ఎఫెక్ట్.. యువకుడి కంటిలో రక్తస్రావం

గణేశ్ ఉత్సవాల్లో లేజర్ లైట్ కిరణాల ప్రభావంతో ఓ యువకుడి కంటి రెటీనాలో అంతర్గత రక్తస్రావం జరిగిన ఘటన MHలోని కొల్హాపూర్లో జరిగింది. మరో ఘటనలో ఓ కానిస్టేబుల్ కన్ను ఈ లైట్ల కారణంగా ఎర్రగా మారి వాచింది. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా లేజర్ లైట్ పవర్ 5 మిల్లీవాట్స్ దాటితే కంటి చూపు సైతం పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో వీటిని బ్యాన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Similar News
News January 13, 2026
జనగామ మాజీ ఎమ్మెల్యే ఆస్తుల అటాచ్!

జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఐటీ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. ఆయన కుమార్తె తుల్జా భవానీ రెడ్డి పేరిట ఉన్న ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. జనగామలోని ఆరు ప్లాట్లు, చేర్యాలలోని స్థలాలను ఈ పరిధిలోకి తెచ్చారు. గతంలో ఈ ఆస్తుల కొనుగోలుకు సంబంధించి తనకు ఏమీ తెలియదని, తండ్రి చెప్పడంతోనే సంతకాలు చేశానని భవానీ రెడ్డి ఐటీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.
News January 13, 2026
పిండివంటల కోసం ఈ చిట్కాలు

* పిండి వంటలు చేసేటపుడు నూనె పొంగకుండా ఉండాలంటే మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి, అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.
* వంటకాలు తక్కువ నూనెను పీల్చుకోవాలంటే మూకుడులో కాస్త వెనిగర్ వేయండి.
* వంటగది గట్టు మీద జిడ్డు పోవాలంటే కాస్త వంటసోడా చల్లి పీచుతో రుద్ది కడిగితే శుభ్రపడుతుంది.
*వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలు వేస్తే మంచి వాసన వస్తుంది.
News January 13, 2026
కోడి పందెం బరులు.. బౌన్సర్లు సిద్ధం!

AP: సంక్రాంతి కోడి పందేలకు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బరులు సిద్ధమయ్యాయి. షామియానాలు, సెక్యూరిటీ, బౌన్సర్లు, జనరేటర్లు, పార్కింగ్ స్థలాలు, తదితరాలకు నిర్వాహకులు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు అతిథుల కోసం బుక్ చేస్తున్న రూముల కోసం 3 రోజులకు గానూ రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు. ముఖ్యంగా భీమవరం ఏరియాలో రూముల కోసం భారీగా డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం.


