News September 9, 2024

BREAKING: ఆ రెండు జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు

image

AP: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అల్లూరి జిల్లావ్యాప్తంగా రేపు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ దినేశ్ ఉత్తర్వులిచ్చారు. ఏలూరు జిల్లాలోని భీమడోలు, పెదపాడు, మండవల్లి, కైకలూరు, ఏలూరు, ముదినేపల్లి, కలిదిండి మండలాల్లోని పలు పాఠశాలలకు అధికారులు సెలవు ఇచ్చారు. మిగతా స్కూళ్లు యథాతథంగా నడుస్తాయని చెప్పారు.

Similar News

News September 19, 2025

ఆటో డ్రైవర్లకు రూ.15వేలు.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

image

AP: ఆటో/క్యాబ్ డ్రైవర్లు <<17674897>>వాహనమిత్ర <<>>పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. <<17731468>>అప్లికేషన్ ఫాంలను<<>> ఫిల్ చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాలి. వాటిపై సచివాలయ సిబ్బంది 22న క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. అర్హుల జాబితాను 24న ప్రకటిస్తారు. ఎంపికైన వారికి దసరా పండుగ రోజున ఖాతాల్లో రూ.15వేలు జమ చేస్తారు.

News September 19, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 పెరిగి రూ.1,11,330కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.150 ఎగబాకి రూ.1,02,050 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2000 పెరిగి రూ.1,43,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 19, 2025

తిరుమలలో ప్లాస్టిక్ ఇస్తే రూ.5!

image

AP: ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు తిరుమల పీఏసీ-5లో రీసైక్లింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ Reklaim Ace యంత్రం పనితీరును అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి నిన్న పరిశీలించారు. భక్తులు ఈ యంత్రంలో టెట్రా ప్యాక్స్, స్నాక్స్ ప్యాకెట్లు వదిలివేయవచ్చని, అందుకోసం UPI ద్వారా లాగిన్ అయ్యి QR కోడ్ స్కాన్ చేయాలని అధికారులు తెలిపారు. రింగ్‌లో ప్లాస్టిక్ వదిలివేసే వారికి రూ.5 ప్రోత్సాహకంగా లభిస్తుందన్నారు.