News September 9, 2024

బాహుబలి-2, పఠాన్ రికార్డులు బ్రేక్ చేసిన ‘స్త్రీ-2’

image

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘స్త్రీ-2’ సినిమా జోరు కొనసాగుతోంది. హిందీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల జాబితాలో రెండో స్థానానికి చేరింది. రూ.584 కోట్లతో జవాన్ అగ్రస్థానంలో ఉండగా, స్త్రీ-2(రూ.551 కోట్లు) సెకండ్ ప్లేస్‌లో ఉంది. త్వరలోనే నంబర్-1కు చేరే అవకాశం ఉంది. 3, 4, 5 స్థానాల్లో గదర్-2(రూ.527 కోట్లు), పఠాన్(రూ.524 కోట్లు), బాహుబలి-2(రూ.511 కోట్లు) ఉన్నాయి.

Similar News

News November 2, 2025

ప్రయాణాల్లో వాంతులవుతున్నాయా?

image

ప్ర‌యాణాల్లో వాంతులు అవ‌డం అనేది సాధార‌ణంగా చాలా మంది ఎదుర్కొనే స‌మ‌స్య. వికారంగా అనిపించ‌డం, త‌ల తిర‌గ‌డం, పొట్ట‌లో అసౌకర్యంగా ఉండడం ఇవ‌న్నీ మోష‌న్ సిక్‌నెస్ ల‌క్ష‌ణాలు. దీన్ని తగ్గించాలంటే అల్లం రసం, హెర్బల్ టీ వంటివి తాగాలి. శ్వాస వ్యాయామాలు చేయాలి. నిమ్మకాయ వాసన చూసినా వికారం తగ్గుతుంది. అలాగే ప్రయాణానికి ముందు తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఆహారం తీసుకోవాలి. హెవీ ఫుడ్స్‌ సమస్యను మరింత పెంచుతాయి.

News November 2, 2025

కీలక వికెట్లు కోల్పోయిన భారత్

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (25), గిల్ (15), కెప్టెన్ సూర్య (24) ఔటయ్యారు. తిలక్ వర్మ, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 8 ఓవర్లలో 82/3గా ఉంది. సూర్య సేన విజయానికి మరో 72 బంతుల్లో 105 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News November 2, 2025

సన్నబియ్యంలో కేంద్రం వాటా రూ.42, రాష్ట్రానిది రూ.15: కిషన్ రెడ్డి

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే సన్నబియ్యం రద్దవుతాయని సీఎం రేవంత్ ప్రజలను బెదిరిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. సన్నబియ్యం స్కీమ్ కేంద్రానిదని, కేజీకి మోదీ సర్కారు రూ.42 ఇస్తే, రాష్ట్రం వాటా రూ.15 మాత్రమే అని పేర్కొన్నారు.