News September 10, 2024
నందిపేటలో రక్షణ కోసం రాళ్లు పట్టిన మహిళలు

నందిపేటలో ఒకే రోజు వరుసగా పది మందిని పిచ్చి కుక్క విచక్షణారహితంగా కరిచి తీవ్ర గాయాలపాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మండల కేంద్రంలోని మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, తమ పనుల నిమిత్తం ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే తమ రక్షణ కోసం రాళ్లు పట్టుకొని వెళ్లే దుస్థితి ఎదురయ్యింది. కుక్క వచ్చి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి ఉందని ఏదైనా పనుల నిమిత్తం బయటకు వెళ్ళడానికి భయంగా ఉందని అంటున్నారు.
Similar News
News February 25, 2026
ఇందూరు: ఇంటర్ పరీక్షలకు 576 మంది గైర్హాజరు

నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 19,150 మంది విద్యార్థులకు 18,574(97%) హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా హైపవర్ కమిటీ, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పర్యవేక్షించారు.
News February 25, 2026
నిజామాబాద్: చెవి నొప్పికి ఆపరేషన్.. యువకుడి మృతి

నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల భీంగల్ మండలం పల్లికొండకు చెందిన గంగం అజయ్ మృతి చెందాడు. చెవి నొప్పితో వచ్చిన అజయ్‌కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తుండగా పరిస్థితి విషమించింది. మత్తు మందు వికటించడం వల్లే అజయ్ చనిపోయాడని, ఆసుపత్రిలో సరైన సౌకర్యం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News February 25, 2026
నిజామాబాద్: కో-ఆప్షన్ పదవులపై ఆశావహుల కన్ను

మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో కార్పొరేటర్లతో సమాన హోదా కలిగిన కో-ఆప్షన్ సభ్యుల పదవుల కోసం నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఐదుగురికి, మున్సిపాలిటీల్లో నలుగురికి ఈ అవకాశం ఉండనుంది. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం 45 రోజుల్లోనే ఈ పదవులను భర్తీ చేయాల్సి ఉంటుంది. త్వరలో నోటిఫికేషన్ వెలువడనుండటంతో ఆశావహులు ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.


