News September 10, 2024
BIG RELIEF: కోలుకుంటున్న బెజవాడ

AP: వరదలతో అతలాకుతలమైన విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వారం రోజులుగా అటు వరదలు, ఇటు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు బయటకు వస్తున్నారు. నిన్న వర్షం కురవకపోవడంతో సహాయక చర్యలూ వేగంగా సాగాయి. వ్యాధులపై ఇంటింటి సర్వే నిర్వహించారు. మరోవైపు ధ్వంసమైన ప్రకాశం బ్యారేజీ గేట్ల స్థానంలో కొత్తవాటిని బిగించింది. ఇందుకోసం కన్నయ్య నాయుడిని రంగంలోకి దించింది.
Similar News
News January 21, 2026
మా వైఖరిలో మార్పు లేదు: బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

ICC T20WC మ్యాచ్‌లు భారత్‌లో ఆడేదే లేదని, తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ స్పష్టం చేశారు. భద్రత దృష్ట్యా తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరామని చెప్పారు. BCCI ఒత్తిడితో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే అంగీకరించబోమన్నారు. తాము తప్పుకుంటే స్కాట్లాండ్‌ను చేర్చుతారన్న వార్తలను కొట్టిపారేశారు. గతంలో పాకిస్థాన్ భారత్‌కు రాకపోతే వేదిక మార్చారని గుర్తు చేశారు.
News January 21, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 21, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.29 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.05 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.21 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 21, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


