News September 10, 2024
నేరుగా అకౌంట్లలోకే రూ.16,500: మంత్రి

TG: రాష్ట్రంలో సంభవించిన వరదల వల్ల 358గ్రామాల్లో దాదాపు 2లక్షల మంది నష్టపోయారని మంత్రి పొంగులేటి అన్నారు. వర్షాలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలోనే రూ.16,500 జమ చేస్తామన్నారు. అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా వరద <<14062097>>సాయాన్ని<<>> అందిస్తామన్నారు. భూపత్రాలు, రేషన్, ఆధార్ కార్డులతో పాటు ఇతర పత్రాలు కోల్పోయిన వారు పోలీస్ స్టేషన్లలో దరఖాస్తు చేసుకుంటే డూప్లికేట్ ఇస్తామన్నారు.
Similar News
News February 15, 2026
శివుడి చేతిలో ఢమరుకం ఎందుకు ఉంటుంది?

ఢమరుకనాదం విశ్వ సృష్టికి మూలం. ఇది ఓంకారనాదానికి ప్రతీక. దీన్నుంచే శబ్దశాస్త్రం, వ్యాకరణం ఉద్భవించాయని పురాణాలు వాక్కు. ఢమరుకంలోని 2 భాగాలు పురుష, ప్రకృతి శక్తుల కలయికను సూచిస్తాయి. ఇవి విశ్వాసం, చైతన్యానికి సంకేతం. మనలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక శక్తిని ఈ ధ్వని మేల్కొల్పుతుంది. లయబద్ధమైన ఈ శబ్దం సృష్టి, స్థితి, లయల నిరంతర ప్రక్రియను ప్రతిబింబిస్తూ మనలో భక్తి, సానుకూల భావాన్ని నింపుతుంది.
News February 15, 2026
పండ్ల తోటల్లో పిందె/కాయలు రాలకుండా ఉండాలంటే?

పిందె, కాయలు ఎదిగే దశల్లో, పోషక లోపాల నివారణ కోసం, సూక్ష్మ, స్థూల పోషకాలను అందించాలి. కాయ ఎదుగుతున్న దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. పండ్ల తోటలను ఆశించే పురుగులు, తెగుళ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నివారణ చర్యలను పాటించాలి. అధిక సంఖ్యలో పిందెలు ఏర్పడితే బలహీనమైన, తక్కువ పరిమాణంలో ఉన్న పిందెలను తీసేస్తే పోషకాలు సమానంగా అంది రాలడం తగ్గుతుంది. పండు ఈగ కట్టడికి మిథైల్ యూజినాల్ ఎర వాడాలి.
News February 15, 2026
రెండేళ్లలో 40% నుంచి 6%కి ఓలా మార్కెట్ షేర్

ఒకప్పుడు దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. 2024 జనవరిలో 40%కి దగ్గరగా ఉన్న మార్కెట్ షేర్.. 2026 జనవరి నాటికి 6% కంటే తక్కువకు పడిపోయింది. సర్వీస్ నాణ్యత లోపాలు, పెరుగుతున్న కస్టమర్ కంప్లైంట్స్, ఇతర కంపెనీల నుంచి పోటీతో ఓలా ఐదో స్థానానికి పడిపోయింది. డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో కంపెనీ ఆదాయం రూ.470 కోట్లకు పడిపోయింది.


