News September 10, 2024

కడప: డయల్ యువర్ కలెక్టర్‌కు విశేష స్పందన

image

డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన, సత్వర పరిష్కారం లభించింది. సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు కలెక్టర్ శివశంకర్ లోతేటి నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం ఏడుగురు మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను విన్నవించారు. ఫిర్యాదులకు సంబంధించిన శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని కడప ఇన్‌ఛార్జ్ ఆర్డీఓ వెంకటపతి ఆదేశించారు.

Similar News

News March 2, 2026

పుష్పగిరి నీళ్లలో యువకుని మృతదేహం లభ్యం

image

పుష్పగిరి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో నీళ్లలో ఈత కోసం దిగి గల్లంతైన చైతన్య మృతదేహం లభ్యమైంది. రిస్క్ టీం సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మరో యువకుని జాడ కనిపించలేదు.

News March 2, 2026

ప్రొద్దుటూరు హాస్టళ్లో విద్యార్థి సూసైడ్.. డీఈవో ఆరా.!

image

పొద్దుటూరు ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో ఆదివారం రాత్రి 10వ తరగతి విద్యార్థి తలారి నరసింహులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. డీఈవో శంషుద్దీన్ సోమవారం ఉదయం హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్ బ్రహ్మయ్యను విచారించారు. ఘటనకు గల కారణాలను అడిగారు. మార్చురీకి వెళ్లి విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. MEOలు శోభా, సావిత్రి, AMO విజయభాస్కర్ ఉన్నారు.

News March 2, 2026

ప్రొద్దుటూరు: హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య

image

ప్రొద్దుటూరు పట్టణంలోని SC హాస్టల్లో విద్యార్థి మృతి కలకలం రేపింది. మైలవరం మండలం కల్లుట్ల గ్రామానికి చెందిన తలారి నరసింహులు(15) 10వ తరగతి చదువుతున్నాడు. మోడంపల్లె హాస్టల్లో ఉంటున్నాడు. ఏమైందో ఏమో రాత్రి హాస్టల్ ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 2టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.