News September 10, 2024

రైతులకు వచ్చే నెల నుంచి ఆధార్ తరహా ఐడీ కార్డులు

image

రైతులకు ఆధార్ తరహాలో ప్రత్యేక ID కార్డులు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే లక్ష్యంతో అక్టోబర్ నుంచి వీటిని జారీ చేయనుంది. దీనిని పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే UP, మహారాష్ట్రలో అమలు చేసింది. మరో 19 రాష్ట్రాలు కూడా ఇందుకు అంగీకరించాయని కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వ స్కీమ్‌లు, కనీస మద్దతు ధరకు పంటల అమ్మకం, కిసాన్ క్రెడిట్ కార్డు వాడకంలో ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.

Similar News

News February 1, 2026

సౌమ్య కుటుంబానికి రూ.కోటి

image

TG: గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ <<19018914>>మరణించిన<<>> నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి నగదుతోపాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సౌమ్య ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఎక్సైజ్‌ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆయుధాలు సమకూర్చుతామన్నారు.

News February 1, 2026

వంటింటి చిట్కాలు

image

* టమాటా, పండు మిరపకాయ పచ్చళ్లు ఎర్రగా ఉండాలంటే తాలింపులో వంటసోడా కలిపితే సరిపోతుంది.
* కూరల్లో గ్రేవీ పలచగా అయినప్పుడు కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* ఇడ్లీ పిండి పలుచగా అయినప్పుడు దానిలో చెంచా బ్రెడ్ పొడి, పావు చెంచా మొక్కజొన్న పిండిని నీళ్లలో కలిపి చేర్చితే పిండి గట్టిగా అవడంతో పాటు ఇడ్లీలు మృదువుగా వస్తాయి.

News February 1, 2026

కొనసాగుతున్న గోల్డ్, సిల్వర్ రేట్ల పతనం

image

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌(MCX) <<19015375>>ఫ్యూచర్ ట్రేడింగ్‌లో<<>> బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. ఇవాళ వీటి రేట్లు భారీగా పడిపోయాయి. ఏప్రిల్‌కు సంబంధించి గోల్డ్ రేటు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.4,834 తగ్గి రూ.1,47,511కు చేరింది. ఇక కేజీ వెండి ధర(మార్చి) రూ.26,273 క్షీణించి రూ.2,65,652 పలికింది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం కూడా స్టాక్ మార్కెట్లు పనిచేస్తున్నాయి.