News September 10, 2024

వరద బాధితులకు త్వరలో నష్టపరిహారం: మంత్రి నారాయణ

image

AP: విజయవాడ వరద బాధితులకు త్వరలో నష్టపరిహారం అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. తాజాగా వరద ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, సాయంత్రానికి వరద పూర్తిగా తగ్గుతుందన్నారు. 1.7లక్షల మందికి నిత్యావసర సరుకులు అందించామని, ఆస్తి నష్టంపై సర్వే జరుగుతోందని చెప్పారు.

Similar News

News January 10, 2026

నన్ను ఎంపిక చేయకపోవడాన్ని స్వాగతిస్తున్నా: గిల్

image

T20 WCకు తనను ఎంపిక చేయకపోవడంపై భారత టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ గిల్ తొలిసారి స్పందించారు. సెలక్టర్ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అలాగే WC జట్టుకు విషెస్ తెలిపారు. దేశం తరఫున ఆడుతున్న ప్రతి ప్లేయర్ తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారని, అయితే జట్టును ఎంపిక చేసే నిర్ణయం సెలక్టర్లదే అన్నారు. తాను ఎక్కడ ఉండాలనుకున్నానో అక్కడే ఉన్నానని, తన డెస్టినీ ఎలా ఉంటే అలా జరుగుతుందని వ్యాఖ్యానించారు.

News January 10, 2026

బడ్ చిప్ విధానం అంటే ఏమిటి?(1/2)

image

ఈ పద్ధతిలో చెరకు గడల నుంచి అర్ధ చంద్రాకారపు కన్నులను వేరు చేసి పెంచుతారు. చెరకు గడల్లో కుళ్లిన, వేర్లు వచ్చిన చెరకు కన్నులను విత్తన శుద్ధి చేసుకొని ట్రేలలో అమర్చుకోవాలి. ఈ పద్ధతిలో మూడు కళ్ల ముచ్చెలకు బదులుగా చెరకు కన్నులను మాత్రమే యంత్రం సహాయంతో వేరు చేసి విత్తనంగా వాడతారు. ప్లాస్టిక్ ట్రేలలో గుంతలను 1/3 వంతు వరకు కోకోవిట్‌తో నింపి కన్నులను పైకి ఉండేటట్లు వాలుగా ఉంచాలి.

News January 10, 2026

బడ్ చిప్ విధానం అంటే ఏమిటి?(2/2)

image

చెరకు ట్రేలను ఒకదానిపై ఒకటి వరుసగా పేర్చి ప్లాస్టిక్ షీట్లతో గాలి తగలకుండా కప్పాలి. మొలకెత్తిన ట్రేలను 4వ రోజు గ్రీన్‌హౌస్‌లోకి మార్చుకొని రోజు విడిచి రోజు నీటితో తడపాలి. విత్తు పొడవు 5 సెం.మీ. ట్రై క్యావిటీ 98 సి.సి కలిగినవి అయితే మొలకలు 25-30 రోజుల వరకు ఆరోగ్యవంతంగా ఉండి మంచి దిగుబడి వస్తాయి. బడ్ చిప్ పద్ధతిలో నారు పెంచడానికి లేత తోటల నుంచి పురుగులు, తెగుళ్లు ఆశించని గడలనే ఎంపిక చేసుకోవాలి.