News September 10, 2024

LPGతో వంట ఖర్చు 5 రూపాయలే: కేంద్ర మంత్రి

image

పీఎం ఉజ్వల స్కీమ్‌లో ప్రతిరోజూ వంటకయ్యే ఖర్చు రూ.5 అని పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ పురి అన్నారు. ఆ స్కీమ్‌లో లేనివాళ్లకు రూ.12 అవుతుందన్నారు. ‘గతంలో గ్రామాల్లో స్వచ్ఛ వంట ఇంధనం పరిమితంగా లభించేది. 2014లో 14 కోట్లున్న LPG కనెక్షన్లు 2024కు 33 కోట్లకు పెరిగాయి. సిలిండర్ ధరలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటాయి. నన్నడిగితే వారి హయాంలో అసలు సిలిండర్లే లేవంటాను’ అని పేర్కొన్నారు.

Similar News

News July 6, 2025

ఇంజినీరింగ్.. ఏ బ్రాంచ్‌లో ఎన్ని సీట్లు?

image

TG: ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుండగా <<16970142>>సీట్ల<<>> వివరాలను అధికారులు వెల్లడించారు. కన్వీనర్ కోటాలో 76,795 సీట్లు ఉన్నాయని తెలిపారు. అత్యధికంగా CSEలో 26,150 సీట్లు, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 12,495 సీట్లు, ECEలో 10,125, CSE డేటా సైన్స్‌లో 6,996, EEEలో 4,301, ITలో 3,681, సివిల్ ఇంజినీరింగ్‌లో 3,129, మెకానికల్‌లో 2,994 సీట్లు ఉన్నాయి.

News July 6, 2025

విదేశీ గడ్డపై భారత్ సరికొత్త చరిత్ర

image

ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో విజయంతో గిల్ సేన సరికొత్త రికార్డు సృష్టించింది. పరుగుల(336) పరంగా విదేశాల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. 2019లో వెస్టిండీస్‌పై 318, 2017లో శ్రీలంకపై 304, 2024లో పెర్త్‌లో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో గెలుపొందింది. చారిత్రక విజయం సాధించిన భారత జట్టుకు కోహ్లీ, గంగూలీ అభినందనలు తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్లేయర్లు అదరగొట్టారని కొనియాడారు.

News July 6, 2025

మోదీజీ.. హిమాచల్ వరదలపై ట్వీట్ చేయరా?: నెటిజన్లు

image

ప్రధాని మోదీ అమెరికాలో వచ్చిన వరదలపై స్పందించారు కానీ హిమాచల్ ప్రదేశ్ (HP)విలయంపై మాట్లాడకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. టెక్సాస్ వరదల్లో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ మోదీ 22 గంటల క్రితం ట్వీట్ చేశారు. అమెరికా ప్రభుత్వానికి, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కానీ 5 రోజుల క్రితమే HPలో వరదలు వచ్చి 74 మంది చనిపోయినా, ఎంతో మంది నిరాశ్రయులైనా ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.