News September 10, 2024

ఉమ్మడి తూ.గో.లో విజృంభిస్తున్న విష జ్వరాలు

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 162 PHCలు, 12 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏడు ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నిత్యం సగటున 2వేల వరకు సీజనల్ జ్వరాల కేసులు నమోదు కావడం కలవర పెడుతోంది. వీటికి తోడు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారు. గత నెలలో 50 వేల కేసులు, ఈ నెలలో ఇప్పటివరకు 13వేల కేసులు నమోదయ్యాయి.

Similar News

News October 18, 2025

రాజమండ్రి: 20న పీజీఆర్‌ఎస్‌కు సెలవు

image

దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 20(సోమవారం) రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినాన్ని పురస్కరించుకుని జిల్లా, డివిజన్, మండల, సచివాలయ స్థాయిలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌) నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా meekosam.ap.gov.in ద్వారా తెలియజేయవచ్చని ఆమె శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

News October 18, 2025

రాజమండ్రి: నార్కో కో- ఆర్డినేషన్ కమిటీ సమావేశం

image

తూర్పు గోదావరి జిల్లాను గంజాయి, మాదకద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శుక్రవారం రాజమండ్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జిల్లా స్థాయి నార్కో కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రజలలో చైతన్యం పెంచి, యువత గంజాయికి దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News October 18, 2025

నిడదవోలు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

నిడదవోలు మండలం మునిపల్లి – కలవచర్ల మార్గంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మునిపల్లికి చెందిన అత్తిలి నాగరాజు (45) మృతి చెందాడు. కోరుపల్లి అడ్డరోడ్డు వద్ద నాగరాజు ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో బైకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమిశ్రగూడెం ఎస్సై బాలాజీ సుందరరావు తెలిపారు.