News September 10, 2024
ఇండియా-ఏ జట్టులోకి గుంటూరు కుర్రాడు

గుంటూరు కుర్రాడికి ఇండియా టీంలో చోటు దక్కింది. దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఏ జట్టుకు జురెల్ స్థానంలో షేక్ రషీద్‌ను ఎంపిక చేశారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రషీద్ ఎంపికైన విషయం తెలిసిందే. ఇండియా అండర్-19 జట్టుకూ ప్రాతినిధ్యం వహించాడు. ఈ 19ఏళ్ల గుంటూరు కుర్రాడు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేస్తాడు.
Similar News
News November 3, 2025
ANU: వ్యాయామ విద్య పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఈ ఏడాది డిసెంబర్ ఒకటి నుంMR ప్రారంభం కానున్న బీపీఈడీ, డీపీఈడీ, ఎంపీఈడీ వ్యాయామ విద్య పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం సాయంత్రం తెలిపారు. పరీక్ష ఫీజు, తదితర వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చని చెప్పారు.
News November 3, 2025
ప్రతీగ్రామం స్వచ్ఛతకు నిలయం కావాలి: కలెక్టర్

ప్రతి గ్రామం స్వచ్ఛతకు నిలయం కావాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నీరు, పారిశుద్ధ్య కమిటీ సమావేశం సమావేశం జరిగింది. పారిశుద్ద్య నిర్వహణకు పెద్ద పీట వేయాలని, ఎక్కడా బహిరంగ మల విసర్జన లేకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. బహిరంగ మల విసర్జన రహిత (ఓ.డి.ఎఫ్) గ్రామాలుగా గతంలో ప్రకటించిన గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి పరిస్థితులను గమనించాలన్నారు.
News November 3, 2025
GNT: 4న పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ రాక

రాష్ట్ర శాసనసభా పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఈ నెల 4న గుంటూరు జిల్లాలో పర్యటిస్తుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్‌కి చేరుకుంటుందని చెప్పారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ కార్యకలాపాలను సమీక్షిస్తుందన్నారు. 2.30 ని.ల నుంచి ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ అంశాల పై సమీక్ష ఉంటుందన్నారు.


