News September 10, 2024

జననాల రేటు పెంచేందుకు కిమ్ ఏం చేశారంటే?

image

ఉత్తర కొరియాలో జననాల రేటును పెంచేందుకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. అబార్షన్లు చేయడం చట్టవిరుద్ధమైనప్పటికీ కొందరు వైద్యులు రహస్యంగా కొనసాగిస్తున్నారు. దీంతో ఇలా చేయకుండా ఉండేందుకు వైద్యుల జీతాలను భారీ పెంచారు. కానీ కొందరు మారకపోవడంతో దొరికిన వైద్యులకు జైలు శిక్ష విధిస్తున్నారు. కాగా ఎక్కువ మంది పిల్లలున్న వారికి గృహాలు, ఆహారం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Similar News

News December 30, 2024

‘భారత్‌కు బ్యాడ్‌న్యూస్. ఎవ్వరూ రిటైరవ్వడం లేదు’

image

మెల్‌బోర్న్ టెస్టులో టీమ్ఇండియా ఘోర ఓటమిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కోహ్లీ, రోహిత్ వీడ్కోలు పలకాలంటూ Retire హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే 55k పోస్టులు పెట్టారు. ‘సిగ్గుంటే రోహిత్, కోహ్లీ రిటైరవ్వాలి’, ‘టెస్టులకు అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వడం అవమానం కాదు. రోహిత్, కోహ్లీ ఇంకా ఆడుతుండగా ఇవ్వడమే అవమానం’, ‘భారత్‌కు బ్యాడ్‌న్యూస్. ఎవ్వరూ రిటైరవ్వడం లేదు’ అని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.

News December 30, 2024

మన్మోహన్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం: కిషన్ రెడ్డి

image

TG: వాజ్‌పేయి తరహాలోనే మన్మోహన్ సింగ్‌కు అంత్యక్రియలు నిర్వహించినట్లు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రధానిగా సేవలందించిన నెహ్రూ కుటుంబేతర వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తగిన విధంగా గౌరవించలేదని విమర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటు అన్నారు.

News December 30, 2024

Stock Market: లాభాల నుంచి నష్టాల్లోకి

image

Mon ప్రారంభ సెష‌న్‌ను లాభాల‌తో ఆరంభించిన స్టాక్ మార్కెట్లు చివ‌రికి న‌ష్టాల‌తో ముగించాయి. Sensex 78,248 (-450) వ‌ద్ద‌, నిఫ్టీ 23,644 (-168) వద్ద స్థిర‌ప‌డ్డాయి. అధిక వెయిటేజీ రంగాలైన బ్యాంకు, ఫైనాన్స్‌, ఆటో, మెట‌ల్ షేర్ల‌పై అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్ ఇండెక్స్ రాణించాయి. Sensexలో 79,090 వ‌ద్ద‌, నిఫ్టీలో 23,900 వ‌ద్ద కీల‌క రెసిస్టెన్స్ సూచీల‌కు అడ్డుగోడ‌లా నిలిచింది.