News September 10, 2024

ODI హిస్టరీలో తొలి ‘డబుల్ సెంచరీ’ ఎవరిదో తెలుసా?

image

ODI క్రికెట్‌లో ‘డబుల్ సెంచరీ’ అనగానే సచిన్, రోహిత్ గుర్తుకొస్తారు. సచిన్ 2010లో తొలిసారి 200* రన్స్ బాదారు. కానీ అంతకు 13ఏళ్ల ముందే ఆసీస్ మహిళా క్రికెటర్ బిలిందా క్లార్క్ 229* పరుగులు చేశారు. ODI క్రికెట్ హిస్టరీలో ఇదే తొలి డబుల్ సెంచరీ. ముంబై వేదికగా జరిగిన 1997 WCలో డెన్మార్క్‌పై ఈ ఫీట్ నమోదుచేశారు. ఆమె 54వ పుట్టినరోజు నేడు. ఈ ప్లేయర్ 118 వన్డేల్లో 4,844 రన్స్, 15 టెస్టుల్లో 919 రన్స్ చేశారు.

Similar News

News December 21, 2024

నా సహచరులు విధిలేక బీఆర్ఎస్‌లో ఉన్నారు: సీఎం రేవంత్

image

కొంతమంది నేతలు విధిలేక BRSలో కొనసాగుతున్నారని CM రేవంత్ అన్నారు. ‘BRSలోనూ రాష్ట్రం కోసం ఆలోచించే కొంతమంది ఉన్నారు. విధిలేని పరిస్థితుల్లో, రాజకీయ కారణాలతో వేరే దారిలేక ఆ పార్టీలో కొనసాగుతున్నారు. వారు హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. నగరం అభివృద్ధి చెందితే వారి గౌరవం పెరుగుతుంది. ఆ నేతలకు చెబుతున్నా. BRS వారితో సావాసం చేయకండి. వాళ్లు తెలంగాణ సమాజం కోసం పనిచేసే రకాలు కాదు’ అని పేర్కొన్నారు.

News December 21, 2024

విరాట్ కోహ్లీ పబ్‌కు నోటీసులు

image

బెంగళూరులోని టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్’ పబ్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారు. క్లబ్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించనందుకే BBMP (బెంగళూరు బృహత్ మహానగర పాలికే) సమన్లు జారీ చేసింది. ఈ పబ్ చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఉన్న రత్నం కాంప్లెక్స్‌లోని ఆరో ఫ్లోర్‌లో ఉంది. దీనిపై గత నెల 29న సామాజిక కార్యకర్త హెచ్.ఎమ్ వెంకటేశ్ ఫిర్యాదు చేయగా నోటీసులు పంపింది.

News December 21, 2024

సినీ స్టార్లపై సీఎం రేవంత్ ఫైర్

image

TG: అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో హీరో అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించారని CM రేవంత్ మండిపడ్డారు. బన్నీ బాధ్యతరాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ‘సంధ్య థియేటర్‌కు హీరో, హీరోయిన్ రావొద్దని చెప్పాం. వారు అక్కడికి వచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారు. తల్లి చనిపోయి, కుమారుడు చావు బతుకుల్లో ఉంటే ఒక్క సినీ స్టార్ పరామర్శించలేదు. నటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు?’ అని ఫైర్ అయ్యారు.