News September 10, 2024

హజ్ యాత్రకు దరఖాస్తు గడువు పెంపు: మంత్రి

image

హజ్ యాత్ర కోసం ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు గడువును ఈనెల 23వ తేదీ వరకు పెంచినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మంగళవారం తెలిపారు. దరఖాస్తులకు ఈనెల 9వ తేదీ వరకు నిర్ణయించారని, ప్రస్తుతం గడువు పొడిగించామని పేర్కొన్నారు. దరఖాస్తులన్నీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించడం కోసం కేంద్ర హజ్ కమిటీ దేశవ్యాప్త ప్రకటన చేసిందన్నారు.

Similar News

News September 14, 2025

ఉల్లి కొనుగోలు ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష

image

కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి ఉత్పత్తులను కలెక్టర్ సిరి శనివారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ నవ్యతో కలిసి ఎగుమతుల పరిస్థితి, కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉల్లి కొనుగోలు విషయంలో ఆలస్యం లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర తప్పనిసరిగా చెల్లించాలన్నారు.

News September 13, 2025

కర్నూలు: ‘ప్రజల వద్దకే తపాల సేవలు’

image

తపాల శాఖలో నూతన టెక్నాలజీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐయంఏ 2.O ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజల ముంగిటే తపాల సేవలను అందివ్వడం జరుగుతుందని కర్నూలు జిల్లా పోస్టల్ ఎస్పీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం తుంగభద్ర ఉప తపాల కార్యాలయంను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బీపీఎంలు, ఎబీపీఎంలతో సమావేశం నిర్వహించారు. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్‌తో తపాల బీమా, ఐపీపీబీ ద్వారా ఖాతాలు తెరవడం జరిగిందని తెలిపారు.

News September 13, 2025

సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి చేద్దాం: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాను సమిష్ఠి కృషితో అభివృద్ధి చేద్దామని జిల్లా కలెక్టర్ సిరి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కర్నూలు కలెక్టర్‌గా ఇది తన మొదటి పోస్టింగ్ అని, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధికారులందరూ సహకరించాలని కోరారు. జిల్లాలను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.