News September 10, 2024

ప్రముఖ రచయిత నటేశ్వర శర్మ కన్నుమూత

image

TG: ప్రముఖ రచయిత, అష్టావధాని అయాచితం నటేశ్వర శర్మ కన్నుమూశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన ఆయన అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన రచనలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2023లో దాశరథి పురస్కారంతో సత్కరించింది. 1956లో జన్మించిన నటేశ్వర శర్మ సంస్కృతం, తెలుగు భాషల్లో 50కి పైగా రచనలు రాశారు. వందకు పైగా అష్టావధానాలు చేశారు. ఆముక్తమాల్యదపై ఆయన విమర్శనా గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు.

Similar News

News October 18, 2025

పుతిన్‌ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం

image

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ICC) వారెంట్ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలో హంగేరీ వేదికగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్‌తో భేటీ అయ్యాక ఆయనను అదుపులోకి తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. అయితే అలాంటిదేమీ ఉండదని సమాచారం. ICCకి అరెస్ట్ చేసే అధికారం లేదు. అందులోని సభ్యదేశాలే ఈ పనిచేయాలి. కాగా పుతిన్‌కు భద్రత కల్పిస్తామని హంగేరీ PM చెప్పడం గమనార్హం.

News October 18, 2025

విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

image

AP: VSP పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌పై భారీ అంచనాలున్నాయి. పారిశ్రామికవేత్తలను పిలిచేందుకు CBN, లోకేశ్‌ విదేశాలకు వెళ్తున్నారు. గూగుల్, TCS వంటి సంస్థల రాకతో ఈసారి పెట్టుబడులు పెరగొచ్చంటున్నారు. కాగా 2016లో ₹7.03L Cr, 2017లో ₹6.98L Cr, 2018లో ₹3.10L Cr పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వాటిలో పెండింగ్‌ అంశాల్ని పట్టాలెక్కించడంతో పాటు ఈసారి కొత్తవారిని ఆహ్వానించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

News October 18, 2025

కమ్యూనిటీ బయింగ్: 186 కార్లకు ₹21 కోట్ల డిస్కౌంట్!

image

షాపింగులో బల్క్‌గా కొంటే ఏమైనా తగ్గిస్తారా అని బేరమాడటం చూస్తుంటాం. గుజరాత్‌లోని జైన్ కమ్యూనిటీ సభ్యులు దీనిని వేరే లెవల్‌కు తీసుకెళ్లారు. ఏకంగా 186 లగ్జరీ కార్లను ఒకే డీల్‌లో కొనుగోలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ కార్ల విలువ ₹149.54 కోట్లు కాగా, వారు రూ.21.22 కోట్లు డిస్కౌంట్ పొందడం విశేషం. ఒకే కమ్యూనిటీకి చెందినవారు ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి లగ్జరీ కార్లను కొనడం దేశంలోనే చర్చనీయాంశమైంది.