News September 10, 2024
DANGER: దగ్గుకు ఈ మందు వాడొద్దు!

TG: లైసెన్స్ లేకుండా దగ్గు మందు (కాఫ్ సిరప్) తయారు చేస్తున్న కంపెనీపై అధికారులు రైడ్స్ చేశారు. HYD కూకట్‌పల్లిలో అఖిల్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ ‘Glycoril Cough Syrup’ అనే సిరప్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. క్వాలిటీ స్టాండర్డ్స్ లేని ఈ సిరప్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, వినియోగించవద్దని హెచ్చరించారు. ఇలాంటి మందులు ఉంటే 1800-599-6969కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.
SHARE IT
Similar News
News February 2, 2026
కంది మొక్కలను వరి పొలం గట్లపై పెంచితే ఏమిటి లాభం?

AP: కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి సాగు చేస్తున్న పొలాల గట్లపై రైతులు కందిని సాగు చేస్తున్నారు. దీని వల్ల కంది పంట పొలం తయారీకి, పురుగు మందుల కోసం చేసే ఖర్చు ఉండదు. వరికి పెట్టే నీటినే కంది మొక్కలు పీల్చుకొని పెరుగుతాయి. వరి పూత దశలో ఆశించే పురుగులను కంది ఆకర్షించి ఎర పైరుగా పని చేస్తుంది. రైతులకు రెండు పంటల దిగుబడి వస్తుంది. ఇలా పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై కంది విత్తనాలను అందిస్తోంది.
News February 2, 2026
హైదరాబాద్‌లోని IIMRలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News February 2, 2026
పిండి దీపం ఎలా తయారుచేయాలి?

పావుశేరు బియ్యాన్ని 3 గంటల పాటు నానబెట్టి, నీరు వడగట్టి నీడన ఆరబెట్టాలి. అనంతరం ఆ బియ్యాన్ని మెత్తని పిండిలా మిల్లులో పట్టించాలి. ఈ పిండిలో తగినంత బెల్లం తురుము, ఆవు నెయ్యి కలిపి ముద్దలా చేయాలి. ఈ ప్రక్రియ అంతా శుచిగా చేయాలి. ఆ ముద్దను ప్రమిద ఆకారంలో మలచి, మధ్యలో దీపం వెలిగించడానికి వీలుగా గుంటలా చేసి సిద్ధం చేయాలి. కుదిరితే ఆ దీపంపై గోవింద నామాలు దిద్దడం మరింత శ్రేయస్కరం.


