News September 11, 2024
డీజేలకు నో పర్మిషన్: మచిలీపట్నం డీఎస్పీ

వినాయక నిమజ్జన ఊరేగింపులో DJలకు అనుమతి లేదని మచిలీపట్నం డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తెలిపారు. స్థానిక సిరి కళ్యాణ మండపంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమైన ఆయన.. నిమజ్జనం రోజు తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మద్యం తాగి నిమజ్జన ఊరేగింపుల్లో పాల్గొన్నా, ఎక్కడైనా అల్లర్లకు పాల్పడినా కమిటీ వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అందరూ సహకరించి, పండగను ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలన్నారు.
Similar News
News November 3, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

మచిలీపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈ నెల 3వ తేదీన ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీ-కోసం’ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ బాలాజీ తెలిపారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిర్యాదు అభ్యర్థనలు సమర్పించవచ్చని చెప్పారు. జిల్లా ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 2, 2025
కృష్ణా: 22వ జాతీయస్థాయి సాఫ్ట్ టెన్నిస్ టోర్నీకి రాష్ట్ర జట్లు పయనం

జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 22వ జాతీయస్థాయి సీనియర్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌కు ఆంధ్రప్రదేశ్ జట్లు పయనమైనట్లు ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దారం దిలీప్ కుమార్ తెలిపారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్ పురుషులు, మహిళల జట్లు ప్రాతినిథ్యం వహిస్తున్నాయని పేర్కొన్నారు. క్రీడాకారులకు సంఘ సభ్యులు శ్రీనుబాబు, నీరజ శుభాకాంక్షలు తెలిపారు.
News November 1, 2025
కృష్ణా జిల్లాలో 630 మంది వితంతువులకు కొత్త పెన్షన్లు

కృష్ణా జిల్లా వ్యాప్తంగా 630 మంది వితంతు మహిళలకు ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది. నవంబర్ నెల మొదటి తేదీతో ప్రారంభమయ్యే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఈ కొత్త లబ్ధిదారులకు కూడా పెన్షన్ అందజేయనున్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వం ఈ జాబితాను విడుదల చేసింది. ఈ పెన్షన్ల మంజూరు ద్వారా ఎన్నో కుటుంబాలు ఆర్థిక భరోసా పొందారు.


