News September 11, 2024
త్వరలో భారత్‌లో ముయిజ్జు పర్యటన

మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఆయన కార్యాలయ ప్రతినిధి హీనా వలీద్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ పర్యటన విషయంలో ఇరు దేశాల అధినేతలకు అనుకూలమైన సమయంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. చైనాకు అనుకూలుడిగా పేరొందిన ముయిజ్జు అధికారంలోకి వచ్చాక భారత్‌తో మాల్దీవుల సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఈ ఏడాది జూన్ 9న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరుకావడం విశేషం.
Similar News
News February 4, 2026
‘వారణాసి’ మూవీకి నెట్‌ఫ్లిక్స్ రూ.650 కోట్ల ఆఫర్?

SS రాజమౌళి, మహేశ్ బాబుల క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.650 కోట్ల భారీ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఓటీటీ డీల్ అవుతుంది. థియేట్రికల్ రన్‌ను కాపాడేందుకు సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే OTTలో స్ట్రీమింగ్ అయ్యేలా మేకర్స్ ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.
News February 4, 2026
అనిల్ అగర్వాల్ దాతృత్వం.. 75% సంపద దానం!

వేదాంతా గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తన మొత్తం ఆస్తిలో 75% సమాజానికి విరాళంగా ఇస్తానని ప్రకటించారు. సుమారు $4.9B నికర విలువ కలిగిన ఆయన ప్రమోటర్ హోదా నుంచి వైదొలగి ఇకపై ట్రస్టీగా సేవలు అందించనున్నారు. ఇటీవల మరణించిన తన కుమారుడు అగ్నివేశ్ జ్ఞాపకార్థం విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి ₹15 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీని కలిసిన అనంతరం తన నిర్ణయాన్ని ఆయన అధికారికంగా వెల్లడించారు.
News February 4, 2026
$852 బిలియన్లకు మస్క్ సంపద

స్పేస్‌ఎక్స్, xAI విలీనంతో ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. ఫోర్బ్స్ ప్రకారం.. ఈ డీల్ తర్వాత ఆయన నెట్ వర్త్ $852 బిలియన్లకు చేరింది. దీంతో ప్రపంచ చరిత్రలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఆయన నిలిచారు. విలీనం తర్వాత ఏర్పడిన కొత్త సంస్థ విలువ $1.25 ట్రిలియన్లుగా ఉండగా ఈ ఒక్క ఒప్పందం వల్లే మస్క్ సంపదకు అదనంగా $84 బిలియన్లు తోడయ్యాయి. మస్క్ తర్వాత లారీ పేజ్ $278 బిలియన్లతో రెండో స్థానంలో ఉన్నారు.


