News September 11, 2024
తూర్పు గోదావరిలో తీవ్ర విషాదం

AP: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బోల్తా పడి ఏడుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. జంగారెడ్డి గూడెం నుంచి పెరవలి వెళ్తుండగా చిన్నాయిగూడెం వద్ద లారీ పంట బోదెలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుడిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News January 29, 2026
మేడారం జాతరలో మహిళ ప్రసవం

TG: మేడారం వనదేవతల సన్నిధిలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. HYD మౌలాలీకి చెందిన నిండు గర్భిణి రజిత జాతరకు వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున ఆమెకు పురిటి నొప్పులు మొదలవడంతో మేడారంలోని ప్రధాన ఆస్పత్రికి తరలించారు. DMHO డా.అప్పయ్య పర్యవేక్షణలో వరంగల్ CKM ఆస్పత్రి వైద్యులు రమ్య, నికిత ఆమెకు సుఖప్రసవం చేశారు. రజిత మగబిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
News January 29, 2026
OTTలోకి వచ్చేసిన ఛాంపియన్ మూవీ

రోషన్ హీరోగా అనస్వర, అవంతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఛాంపియన్’ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. గతనెల 25న విడుదలైన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను స్పప్న దత్ నిర్మాణంలో ప్రదీప్ అద్వైతం తెరకెక్కించారు. సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ‘గిర గిర గింగిరాగిరే’ సాంగ్ ఈ మూవీలోనిదే.
News January 29, 2026
భారీ జీతంతో ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<


