News September 11, 2024
ఇడ్లీ, దోసె పిండిని ఎన్ని రోజులు వాడొచ్చు?

ఇడ్లీ, దోసె పిండిని కొందరు వారంపాటు ఫ్రిజ్‌లో దాచుకుని వాడతారు. ఆ పిండిని రోజుల తరబడి ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్ని రోజులు ఫ్రిజ్‌లో పెడితే అతిగా పులుస్తుంది. దానిని తింటే కడుపులో మంట, అజీర్తి, ఇన్ఫెక్షన్, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఎక్కువగా పులిసిన పిండిని బయటపడేయాలి. ఇడ్లీ, దోసె పిండిని రుబ్బిన 24 గంటల్లోనే వాడాలి. తాజాగా తింటేనే ఆరోగ్యానికి శ్రేయస్కరం.
Similar News
News December 26, 2025
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్(<
News December 26, 2025
మెదడు దగ్గరి భాగాల్లో కుక్క కరిస్తే డేంజర్!

కుక్క కాటు వేసిన 14 రోజుల తర్వాత రేబిస్ లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు కనిపిస్తే దాదాపు మరణం ఖాయమని, అందుకే కాటు వేసిన వెంటనే వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మెదడుకు దగ్గరగా ఉండే తల, ముఖం, మెడ భాగాల్లో కరిస్తే చాలా డేంజర్ అని, దీనివల్ల రేబిస్ వైరస్ వేగంగా మెదడును చేరుతుందని తెలిపారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌లతో పాటు Rabies Immuno-globulin (RIG) కచ్చితంగా తీసుకోవాలంటున్నారు.
News December 26, 2025
రెండు కేటగిరీల్లో నోబెల్.. రేడియేషన్‌తో మృతి

రెండు సైంటిఫిక్ కేటగిరీల(ఫిజిక్స్ (1903), కెమిస్ట్రీ (1911))లో నోబెల్ సాధించిన ఒకేఒక్కరు మేరీ క్యూరీ. ఆమె భర్త పియరీ క్యూరీతో కలిసి 127ఏళ్ల క్రితం ఇదే రోజు రేడియం, పొలోనియం కనుగొన్నారు. ఒట్టి చేతులతో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ పట్టుకోవడంతో వారు ఉపయోగించిన వస్తువులకూ వ్యాపించాయి. రేడియేషన్ కారణంగా బోన్ మేరో బ్లడ్ సెల్స్‌ను ఉత్పత్తి చేయలేకపోవడంతో అప్లాస్టిక్ అనీమియా వచ్చి మేరీ 1934లో మరణించారు.


