News September 11, 2024

టెట్ అభ్యర్థులకు మరో అవకాశం

image

TG: టెట్‌లో మార్కులు, హాల్ టికెట్, ఇతర వివరాల సవరణకు పాఠశాల విద్యాశాఖ మరో అవకాశం ఇవ్వనుంది. డీఎస్సీ ఫైనల్ కీ విడుదలైన నేపథ్యంలో పలువురు అభ్యర్థులు టెట్ వివరాల తప్పులను సవరించాలని కోరుతున్నారు. ఇవి సవరించకుండా డీఎస్సీ జనరల్ ర్యాంక్ లిస్ట్ ఇస్తే సమస్యలొస్తాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే రెండు రోజులపాటు ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నారు. దీనిపై నేడు లేదా రేపు ప్రకటన వచ్చే అవకాశముంది.

Similar News

News January 16, 2026

HYD: రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇంటికే!

image

నూతన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇకపై RTA కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. కొత్త సాఫ్ట్‌వేర్ అమలుకు HYD యంత్రాంగం కసరత్తు చేస్తోందని ఓ అధికారి తెలిపారు. వాహనదారుడు షోరూమ్‌లోనే డీలర్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చన్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ డైరెక్ట్‌గా పోస్టు ద్వారా ఇంటికే చేరుతుందని పేర్కొన్నారు. ఇది ప్రజలకు సమయం, శ్రమ ఆదా చేసే విధానమని తెలిపారు.

News January 16, 2026

కనుమ రోజున పశువులను ఎలా పూజించాలి?

image

పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటేనే రైతుకి ఉత్సాహం. పంట చేతికి రావడంలో వాటి పాత్ర కీలకం. తమకు సుఖ,సంతోషాలను అందించడానికి అహర్నిశలు కష్టపడే పశువులను రైతులు మరచిపోరు. తమకు జీవనాధారమైన మూగజీవాల పట్ల కృతజ్ఞతగా అన్నదాతలు ‘కనుమ’ రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. ఈ రోజు పశువులను ఎలా పూజిస్తే వ్యవసాయం మరింత సుభిక్షంగా ఉంటుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ <<>>క్లిక్ చేయండి.

News January 16, 2026

T20 వరల్డ్‌కప్‌లో సుందర్ ఆడటం కష్టమే!

image

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ గాయం నుంచి ఇప్పటికీ కోలుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో చివరి రెండు వన్డేలకు దూరమైన సుందర్, ఇప్పుడు టీ20లకూ అందుబాటులో లేరు. ఈ విషయాన్ని ఇటీవల బీసీసీఐ తెలిపింది. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే T20 వరల్డ్‌కప్‌కు కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించడం కష్టమని నివేదికలు చెబుతున్నాయి. దీంతో జట్టులో ఆయన స్థానం అనుమానంగానే మారింది.