News September 11, 2024

ఉమ్మడి ప.గో. జిల్లాలో నేడు సీఎం పర్యటన ఇలా..

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నేడు (బుధవారం) సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం ఏలూరు జిల్లా కైకలూరు వద్ద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే చేస్తారు. 11 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా దుంపగడప గ్రామ పరిధిలో ఉన్న ఉప్పుటేరు వంతెనకు చేరుకుని వరద పరిస్థితిని పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం హెలికాప్టర్‌లో కాకినాడ జిల్లా సామర్లకోట బయలుదేరి వెళ్తారు.

Similar News

News February 27, 2026

ప.గో జిల్లా కలెక్టర్ ఆగ్రహం

image

ఏకీకృత కుటుంబ సర్వేను శనివారం సాయంత్రానికి వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నిర్వహించిన గూగుల్ మీట్ సమీక్షలో ఆమె మాట్లాడారు. నిరంతరం వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నప్పటికీ, సర్వేలో ఆశించిన ప్రగతి కనిపించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశిత గడువులోగా ప్రక్రియను ముగించాలని స్పష్టం చేశారు.

News February 27, 2026

నిజం దాగదు.. RRRపై ఐపీఎస్ సంచలన పోస్ట్

image

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ‘ఎక్స్’ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. “సాధారణంగా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి.. మరి కస్టడీలో అంత దారుణంగా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి?” అని ప్రశ్నించారు. అబద్ధాలు బయటపడుతున్నాయని, నిజం ఎప్పటికీ దాగదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

News February 27, 2026

రఘురామకృష్ణరాజుకు విజయవంతంగా శస్త్రచికిత్స

image

డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజుకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో గురువారం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. విజయవాడలో జరిగిన శాసనసభ్యుల ఆటవిడుపు క్రీడల్లో భాగంగా క్రికెట్ ఆడుతుండగా, పరుగు కోసం ప్రయత్నించి ఆయన కింద పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన మణికట్టు ఎముక విరగడంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.