News September 11, 2024
కేంద్రం, IOA చీఫ్ నాకు సపోర్ట్ ఇవ్వలేదు: వినేశ్ ఫొగట్

పారిస్ ఒలింపిక్స్ సమయంలో IOA చీఫ్ పీటీ ఉష నుంచి తనకు సపోర్ట్ లభించలేదని రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆరోపించారు. ‘ఆమె ఆస్పత్రికి వచ్చి ఓ ఫొటో తీసుకుని వెళ్లారు. అక్కడ కూడా పాలిటిక్స్ జరిగాయి. అందుకే నా గుండె పగిలింది. మెడల్ కోసం CASలో పిటిషన్ కూడా నేనే వేశాను. ప్రభుత్వం బాధ్యత మరిచి థర్డ్ పార్టీగా వ్యవహరించింది’ అని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఫొగట్ హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
Similar News
News July 7, 2025
విద్యార్థులతో మాట్లాడుతూ లోకేశ్ ఎమోషనల్

AP: మంత్రి నారా లోకేశ్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇద్దరు భిక్షాటన చేసే చిన్నారులు అధికారుల చొరవతో తాజాగా స్కూళ్లో చేరగా వారికి భవిష్యత్తులో తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ.. పేదరికం నుంచి బయటపడేలా చేసే శక్తిమంతమైన సాధనం విద్య అని లోకేశ్ చెప్పారు. తాను ఈ స్థాయికి ఎదిగేందుకు తన తల్లే కారణమని, ఆమె వల్లే క్రమశిక్షణ అలవడిందని మంత్రి ఎమోషనల్ అయ్యారు.
News July 7, 2025
యాక్టర్ల ఫోన్ ట్యాపింగ్‌కు ఆధారాల్లేవని పోలీసులు చెప్పారు: BRS

TG: ఫోన్ ట్యాపింగ్ పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర బయటపడిందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ‘సినీ నటుల ఫోన్ ట్యాపింగ్‌కు ఎలాంటి ఆధారాలు లేవని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. పచ్చ మీడియాతో కుమ్మక్కై ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడిన రేవంత్ సర్కార్ కుట్ర ఇది అని తేటతెల్లమైంది’ అంటూ ఓ న్యూస్ క్లిప్పింగ్‌ను షేర్ చేసింది.
News July 7, 2025
Gift A Smile.. 4,910 మందికి కేసీఆర్ కిట్లు: KTR

TG: ఈనెల 24న తన పుట్టిన రోజు సందర్భంగా సిరిసిల్లలోని 4,910 మంది తల్లులకు KCR కిట్లు అందజేస్తామని KTR ప్రకటించారు. ‘2020 నుంచి నా బర్త్ డే రోజున ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమం చేపడుతున్నాం. 2020లో 108 అంబులెన్సులు, 2021లో 1400+ మంది దివ్యాంగులకు ట్రై వీల్ చైర్లు, 2022లో 6వేల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు, 2023లో 116 మందికి ల్యాప్‌టాప్‌లు, 2024లో చేనేత కార్మికుల కుటుంబాలకు సాయం చేశాం’ అని పేర్కొన్నారు.