News September 11, 2024

వినాయక ఉత్సవాలు: భక్తి ఎక్కడ?

image

వినాయక ఉత్సవాల్లో కొంతమంది యువకులు భక్తితో కాకుండా ఎంజాయ్ చేసేందుకు మండపాలు పెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. భజన పాటలు వినిపించాల్సిన మండపాల్లో ఐటమ్ సాంగ్స్ వినబడుతున్నాయి. మరికొందరైతే యువతులతో అసభ్యకర డాన్సులు చేయిస్తున్నారు. మద్యం తాగి నిమజ్జన ఉత్సవాల్లో స్టెప్పులేస్తున్నారు. కొన్ని చోట్ల రాజకీయ నాయకులు, హీరోలు, క్రికెటర్ల రూపాల్లో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News January 23, 2026

బత్తాయి చెట్లు ఎండిపోతున్నాయా?

image

వేరుకుళ్లు తెగులు సోకినప్పుడు చెట్లు వడలి కాయలు రాలిపోతాయి. దీని నివారణకు 1% బోర్డో మిశ్రమం లేదా 0.2% కార్బండిజమ్(లీటరు నీటికి 2గ్రా. చొప్పున) మిశ్రమం 20 లీటర్లు పాదుల్లో పోయాలి. ఒక్కో చెట్టుకు 10KGల మేర వృద్ధి చేసిన ట్రైకోడెర్మా విరివిడిని చెట్ల పాదుల్లో కలియబెట్టాలి. ట్రైకోడెర్మా రెస్సీ 100గ్రా, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 100గ్రా, 2KGల వేప పిండి, 25KGల పశువుల ఎరువుతో కలిపి పాదుల్లో వేసుకోవాలి.

News January 23, 2026

కమ్యూనిస్ట్ గడ్డపై కమలం వికసించేనా?

image

సౌతిండియాలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇటీవల తిరువనంతపురం మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంతో కమలం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇవాళ మోదీ పర్యటన కార్యకర్తల్లో మరింత జోష్ నింపింది. వికసిత్ కేరళం అంటూ ఆయన పిలుపునిచ్చారు. దీంతో త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల పీఠాన్ని కదిలించి కమలం జెండా ఎగురవేస్తామని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి కేరళలో బీజేపీ అధికారం చేపడుతుందా?

News January 23, 2026

BELలో 99 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

చెన్నైలోని BEL 99 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. BE/BTech, BCom, BBA, BBM, డిప్లొమా, ITI అర్హత గలవారు FEB 5, 6, 7 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. Engg. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.17,500, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు రూ.12,500, ITI వారికి రూ.11,040 చెల్లిస్తారు. అప్రెంటిస్‌లుగా ఏడాది పూర్తి చేసుకున్నవారికి రాత పరీక్ష నిర్వహించి ట్రైనీ ఇంజినీర్లు, అడ్వాన్స్‌డ్ ట్రైనీస్‌గా నియమించుకుంటారు.