News September 11, 2024

ఎకరాకు రూ.10వేల పరిహారం ప్రకటించిన సీఎం

image

AP: ఈ నెల 17లోపు వరద పరిహారం అందజేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వరదలతో దెబ్బతిన్న వరి పంటకు ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు. ఉప్పుటేరు, ఎర్ర కాలువ వరదలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టి, అత్యంత వేగంగా పూర్తి చేస్తామన్నారు.

Similar News

News December 22, 2024

అమెరికాలో పెగాసస్ ప్రకంపనలు

image

పెగాసస్ స్పైవేర్ మ‌ళ్లీ వెలుగులోకొచ్చింది. ఈ స్పైవేర్‌ను వృద్ధి చేసిన‌ Israel కంపెనీ NSO చ‌ట్ట వ్య‌తిరేక చర్యల‌ను USలోని ఓ కోర్టు మొద‌టిసారిగా గుర్తించింది. WhatsApp వేసిన కేసులో 1400 మంది యూజ‌ర్లపై దీన్ని వాడిన‌ట్టు కోర్టు నిర్ధారించింది. 2021లో 300 మందిపై NDA Govt నిఘా పెట్టింద‌ని ఆరోప‌ణలు వ‌చ్చాయి. సుప్రీంకోర్టు కమిటీ విచారించింది. విచారణలో కేంద్రం తమకు సహకరించలేదని కమిటీ తెలిపింది.

News December 22, 2024

అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదు: పురందీశ్వరి

image

అల్లు అర్జున్, సీఎం రేవంత్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందీశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదని, ఒక హీరోగా అర్జున్ అక్కడికి వెళ్లారని చెప్పారు. కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా ఏ11గా ఉన్న ఆయనను అరెస్ట్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

News December 22, 2024

పుణ్యక్షేత్రాల్లో పెరిగిన రద్దీ

image

వారాంతం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో శ్రీనివాసుడి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,411మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా హుండీకి రూ.3.44 కోట్ల ఆదాయం సమకూరింది. అటు యాదాద్రిలోనూ భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.