News September 11, 2024

జగన్ తీరుతో ప్రజలు బాధపడుతున్నారు: మంత్రి

image

AP: వరదల అంశాన్ని మళ్లించేందుకే YCP నేతలను అరెస్ట్ చేస్తున్నారన్న జగన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ‘TDP ఆఫీసుపై దాడిని సమర్థించుకోవడం దారుణం. వరదలతో జనం కష్టాల్లో ఉంటే జైలుకెళ్లి ఓ క్రిమినల్‌ను పరామర్శించిన జగన్‌కు GOVTని ప్రశ్నించే హక్కు లేదు. ఇలాంటి విపత్కర సమయంలోనూ జగన్ తీరు మారలేదు. YCPకి 11 సీట్లు కూడా ఎందుకిచ్చామా అని ప్రజలు బాధపడుతున్నారు’ అని మండిపడ్డారు.

Similar News

News January 19, 2026

24% పెరిగిన ఆటోమొబైల్ ఎగుమతులు

image

భారత్ నుంచి 2025లో ఆటోమొబైల్ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2024లో 50,98,474 వాహనాల ఎగుమతి జరగ్గా.. గతేడాది ఆ సంఖ్య 63,25,211(24.1%)కు చేరింది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో డిమాండ్ బాగా పెరుగుతోంది. ప్యాసింజర్ వాహనాల ఎగుమతి 16%, యుటిలిటీ వెహికల్స్ 32శాతం, కార్ల ఎగుమతులు 3% మేర పెరిగాయి. వీటిలో 3.95 లక్షల యూనిట్లు ఎగుమతి చేసి మారుతీ సుజుకీ అగ్రస్థానంలో నిలిచింది.

News January 19, 2026

గ్రీన్‌లాండ్‌కు మద్దతుగా నిలుస్తాం: NATO దేశాలు

image

గ్రీన్‌లాండ్ ప్రజలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, UK దేశాలు జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాయి. ‘ఆర్కిటిక్ రక్షణకు కట్టుబడి ఉన్నాం. మా సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు కలిసి పనిచేస్తాం. టారిఫ్ బెదిరింపులు ట్రాన్స్‌అట్లాంటిక్(US-యూరప్) సంబంధాలను దెబ్బతీస్తాయి. పరిస్థితులు మరింత దిగజారొచ్చు కూడా’ అని అమెరికాను హెచ్చరించాయి.

News January 19, 2026

శభాష్ హర్షిత్ రాణా.. నీపై బాధ్యత పెరిగింది!

image

NZతో జరిగిన వన్డే సిరీస్‌లో హర్షిత్ రాణా అద్భుత ప్రదర్శన చేశారు. 3 వన్డేల్లో కలిపి 6 వికెట్లు తీసి.. 83 రన్స్ చేశారు. అతను జట్టులో అవసరమా అన్న పరిస్థితి నుంచి జట్టుకు అతని అవసరముంది అనేలా రాణించారు. ట్రోల్స్‌ని పట్టించుకోకుండా ముందుకు సాగారు. కోచ్ గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. అతనికి బ్యాటర్‌గానూ అవకాశాలిస్తే జట్టులో మంచి ఆల్రౌండర్‌గా ఎదిగే ఆస్కారముందని క్రీడా నిపుణులు అంటున్నారు.