News September 11, 2024
Stock Market: ఉదయం లాభాలు.. సాయంత్రం నష్టాలు

ఉదయం భారీ లాభాల్లో ట్రేడైన బెంచ్‌మార్క్ సూచీలు సాయంత్రం నష్టాల్లోనే ముగిశాయి. 228 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన నిఫ్టీ 24,918 (-122), 711 రేంజులో చలించిన సెన్సెక్స్ 81,523 (-398) వద్ద క్లోజయ్యాయి. బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్. టాటా మోటార్స్ 5.73% పతనమైంది. ఓఎన్జీసీ, విప్రో నష్టపోయాయి. చైనా ఎకానమీ స్లోడౌన్, యూఎస్ సీపీఐ డేటా నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు.
Similar News
News September 19, 2025
సూర్యపై ఫిర్యాదు చేయనున్న PCB?

పాకిస్థాన్‌పై గెలుపును భారత ఆర్మీకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన <<17712252>>సూర్యకుమార్<<>> యాదవ్‌పై పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆటల్లో సూర్య పొలిటికల్ కామెంట్స్ చేశారని, అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని PCB భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే హ్యాండ్ షేక్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సూర్యపై ఫిర్యాదు చేస్తే ఆదివారం భారత్vsపాక్ మ్యాచ్ మరింత హీటెక్కనుంది.
News September 19, 2025
MANUUలో టీచింగ్ పోస్టులు

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (<
News September 19, 2025
జగనన్నా అసెంబ్లీకి వెళ్లు.. YCP ఫ్యాన్స్

AP: మాజీ సీఎం జగన్ <<17754283>>అసెంబ్లీకి<<>> వెళ్లి ప్రజాసమస్యలపై మాట్లాడాలని వైసీపీ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. అసెంబ్లీలో అవమానాలు, విమర్శలు ఎదురైనా, మైక్ కట్ చేసినా సమస్యలపై గళం విప్పితే ప్రజల్లో సానుభూతి వస్తుందని చెబుతున్నారు. రాష్ట్రంలో యూరియా, ఉల్లి, టమాటా ధరలు పడిపోవడం సహా ఎన్నో సమస్యలు ఉన్నాయని, వీటిపై చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?