News September 11, 2024

మద్యం పాలసీ రూపకల్పనపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

image

AP: నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం తొలిసారి సమావేశమైంది. ఈ భేటీలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ పాల్గొన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి అధికారులు ఇచ్చిన నివేదికపై మంత్రులు సమీక్షించారు. కాగా ఈ నెలాఖరుతో ప్రస్తుత మద్యం పాలసీ గడువు ముగియనుంది.

Similar News

News February 1, 2026

అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలి: హైకోర్టు

image

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి 24 గంటలూ భద్రత కల్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంతవరకు దీన్ని కొనసాగించాలని సూచించింది. అంబటి భార్య వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై కోర్టు ఆదేశాలు జారీచేసింది. అంబటి ఇంటిపై దాడి కేసులో న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది.

News February 1, 2026

ఈసారి ఈ ‘శారీ’

image

బడ్జెట్ ప్రసంగం వేళ FM నిర్మలమ్మ ధరించిన కాంచీపురం చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో, వెండి తీగపై బంగారు పూత మెరిసే జరీతో దీనిని రూపొందించారు. కోర్వాయ్ పద్ధతిలో చీర, అంచులను విడివిడిగా నేసి బలంగా జత చేయడం వీటి ప్రత్యేకత. మూడు పట్టు దారాల కలయిక వల్ల ఇవి బరువుగా, దృఢంగా ఉంటాయి. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ చీరను ఎంపిక చేశారనే <<19018918>>చర్చ<<>> సాగుతోంది.

News February 1, 2026

రైల్వేకు రికార్డు స్థాయిలో ₹2,93,030 కోట్లు

image

బడ్జెట్‌లో రైల్వేకు రికార్డు స్థాయిలో ₹2,93,030 కోట్లు కేటాయించారు. ప్రధానంగా కొత్త లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, ట్రాక్ డబ్లింగ్, ఆధునిక కోచ్‌ల తయారీ వంటి మౌలిక సదుపాయాలతో పాటు ప్రయాణికుల సేఫ్టీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 7 హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. అందులో మూడింటికి హైదరాబాద్ (బెంగళూరు, చెన్నై, పుణే రూట్లు) కేంద్రంగా ఉండటం విశేషం.