News September 11, 2024

హెక్టార్‌కు రూ.25 వేలు ఇస్తాం: చంద్రబాబు

image

వరదల వల్ల నష్టపోయిన పంట పొలాలకు హెక్టార్‌కు రూ. 25 వేలు చొప్పున పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కాకినాడ జిల్లా రాజుపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరదలతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 65 వేల ఎకరాల్లో పొలాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఏలేరు రిజర్వాయర్‌కు అధికంగా వరద రావడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయని చెప్పారు.

Similar News

News August 22, 2025

కాటన్ బ్యారేజీ వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

image

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పడవ ప్రయాణాలు, చేపలు పట్టడం, ఈతకు దిగడం వంటివి పూర్తిగా నిషేధమని జిల్లా యంత్రాంగం తెలిపింది. సహాయం కోసం 1070, 112 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

News August 22, 2025

స్టాక్ పాయింట్లలో 12,97,874 మెట్రిక్ టన్నుల ఇసుక: కలెక్టర్

image

తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 37 స్టాక్ పాయింట్లలో 12,97,874 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. అరికిరేవుల, ధవళేశ్వరం, మునిపల్లి వంటి ప్రధాన స్టాక్ పాయింట్ల వద్ద ఇసుకను నిల్వ ఉంచినట్లు ఆమె వెల్లడించారు. ఇతర జిల్లాలకు సరఫరా చేయడానికి మరిన్ని స్టాక్ పాయింట్లను సిద్ధం చేశామన్నారు.

News August 21, 2025

రాజమండ్రి: ఎక్కడా ఇసుక కొరత లేదు: కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక కొరత ఎక్కడా లేదని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. వర్షాలు, గోదావరి వరదల కారణంగా ఎక్కడ ఇసుక కొరత లేకుండా స్టాక్ పాయింట్ల వద్ద సరిపడా ఇసుకను అందుబాటులో ఉంచామన్నారు. ఇసుక కోసం ప్రజలు, కాంట్రాక్టర్లు, గృహ నిర్మాణాలు చేపట్టే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.