News September 11, 2024

జనం అల్లాడుతుంటే కేసీఆర్ ఎక్కడ?: బండి సంజయ్

image

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘రాష్ట్ర ప్రజలు వరదలతో అల్లాడుతుంటే ఆయన బయటకు ఎందుకు రావడం లేదు? ప్రజలే KCRకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఆయనకు మళ్లీ రీ ఎంట్రీ కలే. KCR కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్‌కు సాధ్యం కావడం లేదు. బీజేపీ గెలిస్తే కేసీఆర్ అంతుచూసేటోళ్లం. ఆయనే దశమ గ్రహం. ఇంకా నవగ్రహ యాగం చేయడం విడ్డూరంగా ఉంది’ అని ఫైరయ్యారు.

Similar News

News July 7, 2025

వార్-2 జర్నీలో ఎంతో నేర్చుకున్నా: Jr.NTR

image

బాలీవుడ్‌ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ‘వార్-2’పై యంగ్ టైగర్ NTR అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ పూర్తైందని తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘హృతిక్ సర్‌తో సెట్‌లో ఉంటే ఎప్పుడూ బ్లాస్టే. ఆయన ఎనర్జీ చాలా ఇష్టం. వార్-2 జర్నీలో ఎంతో నేర్చుకున్నా. ఆడియన్స్‌కు డైరెక్టర్ అయాన్ పెద్ద సర్‌ప్రైజ్ ప్యాకేజ్‌ సిద్ధం చేశారు. టీమ్‌కు థాంక్స్. AUG 14న ఈ ఫీల్‌ను మీరు ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు.

News July 7, 2025

స్మార్ట్ కార్డులుంటేనే సచివాలయంలోకి ఎంట్రీ!

image

AP: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ఎంట్రీకి స్మార్ట్ కార్డు సిస్టమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వచ్చే వారం నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రతి ఉద్యోగికి క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డు అందజేస్తారు. మెయిన్ గేట్ వద్ద వాహనాల నంబర్‌ను స్కాన్ చేసి అనుమతించనున్నారు. ఇందుకోసం టోల్గేట్ తరహా టెక్నాలజీ ఉపయోగించనున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వివరాలు, వాహనాల నంబర్ల సేకరణ ప్రారంభమైంది.

News July 7, 2025

వచ్చే ఏడాది ‘పంచాయత్’ ఐదో సీజన్

image

కామెడీ డ్రామా సిరీస్ ‘పంచాయత్’ ఐదో సీజన్‌ను అనౌన్స్ చేసింది. ఈ సీజన్ వచ్చే ఏడాది స్ట్రీమింగ్‌ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో పోస్టర్‌ను రిలీజ్ చేసింది. హిందీ భాషలో రూపొందిన ఈ సిరీస్ నాలుగు పార్టులు ఇతర భాషల ప్రేక్షకులనూ మెప్పించాయి. జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్‌ను తెలుగులో ‘సివరపల్లి’ పేరిట రీమేక్ చేసి ఈ ఏడాది జనవరిలో తొలి సీజన్‌ను రిలీజ్ చేశారు.