News September 11, 2024
ODI వరల్డ్ కప్ వల్ల భారత్‌కు రూ.11,637 కోట్ల బిజినెస్: ICC

వన్డే ప్రపంచ కప్ వల్ల భారత్‌కు లాభమే జరిగిందని ICC పేర్కొంది. గతేడాది OCT 5 నుంచి NOV 19 వరకు 10 నగరాల్లో ICC మ్యాచ్‌లు నిర్వహించింది. దీని ద్వారా 1.39 బిలియన్ డాలర్ల (రూ.11,637 కోట్లు) బిజినెస్ జరిగిందని ICC ఓ ప్రకటనలో తెలిపింది. మ్యాచులు చూసేందుకు వచ్చిన ఇంటర్నేషనల్ టూరిస్టుల వసతి, ఆహారం, రవాణా వంటివి అత్యధిక బిజినెస్‌ను అందించాయి. దీంతోపాటు రాష్ట్రాల్లోని స్టేడియాలు అప్‌గ్రేడ్ అయ్యాయి.
Similar News
News January 28, 2026
అలాంటి పసుపుకే మంచి ధర: మార్కెటింగ్ శాఖ

TG: పసుపు పంట చేతికొస్తున్న నేపథ్యంలో రైతులకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సూచనలు చేసింది. ఉడికించిన పసుపును 15 రోజులు ఎండబెట్టిన తర్వాతే మార్కెట్ యార్డులకు తీసుకురావాలని తెలిపింది. తేమ శాతం 12%లోపు ఉంటే మంచి ధర దక్కే అవకాశం ఉంటుందని పేర్కొంది. కాడి, గోల, చూర వంటి మలినాలు లేకుండా శుభ్రపరచిన పసుపును తేవాలని సూచించింది. NZB మార్కెట్ యార్డులో పచ్చి పసుపు విక్రయాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపింది.
News January 28, 2026
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో సమావేశాలను నిర్వహించనున్నారు. నేటి నుంచి FEB 13 వరకు తొలి విడత, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సెషన్ జరగనుంది. మొత్తం 30 రోజులు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. నిన్న జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లో MGNREGA, SIR, UGC నిబంధనలు తదితర అంశాలపై చర్చలు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
News January 28, 2026
ప్రైవసీ ఉల్లంఘన ఆరోపణలు అవాస్తవం: వాట్సాప్

ప్రైవసీ ఉల్లంఘన <<18971131>>ఆరోపణలను<<>> WhatsApp మాతృసంస్థ Meta ఖండించింది. ‘మీ మెసేజ్‌లు ప్రైవేట్‌గానే ఉంటాయి. ఓపెన్ సోర్స్ సిగ్నల్ ప్రోటోకాల్‌తో ఎన్‌క్రిప్ట్ (హైడ్) చేస్తాం. మీ డివైజ్ నుంచి బయటకు వెళ్లే ముందే మెసేజ్‌లు ఎన్‌క్రిప్ట్ అవుతాయి. మీరు ఎవరికి పంపారో వాళ్లు మాత్రమే చదవగలరు. వాట్సాప్, మెటా వాటిని యాక్సెస్ చేయలేవు’ అని స్పష్టం చేసింది. కాగా Meta మెసేజ్‌లను చదవగలదని USలో దావా దాఖలవడంతో ఇలా స్పందించింది.


