News September 11, 2024

HYDలో రియల్ ఎస్టేట్ పడిపోయింది: హరీశ్

image

TG: హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఫలితంగా మహానగరంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తూ హైదరాబాద్ ప్రతిష్ఠను మసకబారుస్తున్నారని విమర్శించారు. ఫార్మాసిటీ, మెట్రో రైలు విషయంలోనూ సీఎం మాట మార్చారని మండిపడ్డారు.

Similar News

News July 8, 2025

ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్

image

ఇంగ్లండ్‌ U19తో జరిగిన చివరి వన్డేలో భారత్ U19 చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లు కోల్పోయి 210 పరుగులే చేసింది. అంబ్రిష్(66), సూర్యవంశీ(33) ఫర్వాలేదనిపించినా మిగిలిన అందరూ విఫలమయ్యారు. తర్వాత ఇంగ్లండ్ 31.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా టార్గెట్ ఛేదించింది. అయితే అంతకుముందు 3 మ్యాచ్‌లు గెలిచిన భారత్ 3-2తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

News July 8, 2025

ట్రంప్ టారిఫ్స్ లేఖలు: మొదట ఈ దేశాలకే..

image

US ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్స్ వడ్డన మొదలుపెట్టారు. ఈ మేరకు ఆయా దేశాలకు అధికారికంగా లేఖలు పంపుతున్నారు. మొదటగా జపాన్, సౌత్ కొరియాలకు 25% టారిఫ్స్ విధించారు. జపాన్ PM ఇషిబా, సౌత్ కొరియా ప్రెసిడెంట్ లీ జేకు పంపిన లేఖలను ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘ఇది చాలా తక్కువ’ అని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి టారిఫ్స్ అమల్లోకి వస్తాయన్నారు. దీంతో తర్వాత ఏయే కంట్రీస్‌కు ఎంత విధిస్తారో అన్న ఆందోళన మొదలైంది.

News July 8, 2025

పదవి పోయిన గంటల్లోనే మాజీ మంత్రి మృతి

image

రష్యా రవాణా శాఖ మాజీ మంత్రి రోమన్ స్తారోవోయిత్(53) అనుమానాస్పద స్థితిలో మరణించారు. రోమన్‌ను అధ్యక్షుడు పుతిన్ పదవి నుంచి తొలగించిన గంటల్లోనే తన కారులో శవమై కనిపించారు. గన్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. కాగా ఇటీవల ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో వందలాది విమానాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కారణంతోనే రోమన్‌పై వేటు వేసినట్లు తెలుస్తోంది.