News September 11, 2024
తిరుపతి – శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రద్దు

ఈస్ట్ కోస్ట్ డివిజన్‌లోని పలు ప్రత్యేక రైళ్లును రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తిరుపతి – శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను, అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు శ్రీకాకుళం రోడ్డు – తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News January 18, 2026
విశాఖలో ప్రముఖ వైద్యుడి మృతి

వేలాది పోలియో, వికలాంగ బాధితులకు జీవితాల్లో వెలుగులు నింపిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆదినారాయణరావు(85) శనివారం విశాఖపట్నంలో కన్నుమూశారు. ప్రేమ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడిగా 4 దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆయన సుమారు 3లక్షల శస్త్ర చికిత్సలు చేశారు. పోలియో బాధితులకు చేసిన సేవలకుగాను 2022లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆయన మృతికి వైద్య, ప్రజావర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి.
News January 17, 2026
విశాఖకు రానున్న రాహుల్ గాంధీ.. ఎప్పుడంటే?

పార్లమెంటరీ రక్షణ కమిటీ చైర్మన్ రాధా మోహన్ సింగ్ నేతృత్వంలో ఎంపీల బృందం జనవరి 19 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనుంది. ఈ బృందంలో రాహుల్ గాంధీ, మహువా మోయిత్రా తదితరులు ఉన్నారు. వీరు ఎన్‌ఎస్‌టీఎల్ (NSTL)లో డీఆర్డీఓ ప్రాజెక్టులను, కోస్ట్ గార్డ్ తీరప్రాంత భద్రతను సమీక్షించనున్నారు. వీవీఐపీల రాక నేపథ్యంలో నగరం అంతటా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
News January 17, 2026
విశాఖలో రెండు ట్రావెల్ బస్సులు సీజ్

సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు శనివారం విశాఖలో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లు, రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 2 ట్రావెల్ బస్సులను సీజ్ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన మరో 5 బస్సులపై కేసుల నమోదు చేసి రూ.60,000 జరిమానాలు విధించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


