News September 11, 2024

WARNING.. ఇలాంటి కాల్స్‌తో జాగ్రత్త: సజ్జనార్

image

TG: ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ వస్తున్న వాట్సాప్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని TGSRTC MD సజ్జనార్ హెచ్చరించారు. ‘స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశామని, అడిగినంత డబ్బు ఇవ్వకుంటే చంపేస్తామంటూ తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్లు పోలీసుల పేరుతో ఫోన్ చేసి భయపెడుతున్నారు. ఇలాంటివి నమ్మకండి. అజ్ఞాత వ్యక్తుల కాల్స్‌కు స్పందించకండి. పోలీసులకు ఫిర్యాదు చేయండి’ అని ఓ ఘటనను ఆయన పంచుకున్నారు.

Similar News

News July 7, 2025

ఆరోగ్యం రొట్టె స్వీకరించిన లోకేశ్.. ఎందుకంటే?

image

AP: నెల్లూరు రొట్టెల పండుగలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ ఆరోగ్యం రొట్టెను స్వీకరించారు. సీఎం చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలనే దాన్ని తీసుకున్నానని, ఆయన ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా సంతోషంగా ఉండాలని కూటమి ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. రొట్టెల పండుగ కోసం రూ.10 కోట్లు కేటాయించినట్లు లోకేశ్ వెల్లడించారు.

News July 7, 2025

వార్-2 జర్నీలో ఎంతో నేర్చుకున్నా: Jr.NTR

image

బాలీవుడ్‌ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ‘వార్-2’పై యంగ్ టైగర్ NTR అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ పూర్తైందని తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘హృతిక్ సర్‌తో సెట్‌లో ఉంటే ఎప్పుడూ బ్లాస్టే. ఆయన ఎనర్జీ చాలా ఇష్టం. వార్-2 జర్నీలో ఎంతో నేర్చుకున్నా. ఆడియన్స్‌కు డైరెక్టర్ అయాన్ పెద్ద సర్‌ప్రైజ్ ప్యాకేజ్‌ సిద్ధం చేశారు. టీమ్‌కు థాంక్స్. AUG 14న ఈ ఫీల్‌ను మీరు ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు.

News July 7, 2025

స్మార్ట్ కార్డులుంటేనే సచివాలయంలోకి ఎంట్రీ!

image

AP: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ఎంట్రీకి స్మార్ట్ కార్డు సిస్టమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వచ్చే వారం నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రతి ఉద్యోగికి క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డు అందజేస్తారు. మెయిన్ గేట్ వద్ద వాహనాల నంబర్‌ను స్కాన్ చేసి అనుమతించనున్నారు. ఇందుకోసం టోల్గేట్ తరహా టెక్నాలజీ ఉపయోగించనున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వివరాలు, వాహనాల నంబర్ల సేకరణ ప్రారంభమైంది.