News September 11, 2024
రేపు అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ?

TG: సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఆయన కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిని వివరించేందుకు షా అపాయింట్‌మెంట్‌ను సీఎంవో కోరినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రానికి వరద సాయం చేయాలని సీఎం కేంద్రమంత్రిని కోరే ఛాన్సుంది. అటు ప్రధానితో భేటీకి కూడా రేవంత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 8, 2025
అమెరికా వీసా ట్రై చేసేవారికి బ్యాడ్ న్యూస్

US వెళ్లాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్. ఆ దేశపు వీసా లేదా గ్రీన్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే ఇకపై సోషల్ మీడియా వివరాలూ సమర్పించాల్సి ఉంటుంది. అమెరికా హోంశాఖ ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించింది. వలసల్ని మరింత కట్టుదిట్టం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సోషల్ మీడియాలో సందేశాలు, పోస్టులపై సర్కారు నిఘా వేయనున్న నేపథ్యంలో హెచ్-1బీ, ఈబీ-5 కోసం యత్నిస్తున్నవారికి ఇది ఇబ్బందికరంగా మారొచ్చు.
News March 8, 2025
నిజమైన ఉమెన్స్ డే అప్పుడే.. ఏమంటారు?

ఈరోజు మహిళా దినోత్సవం. సమాజంలో మహిళలకూ పురుషులకున్న హక్కులు ఉంటాయని, అన్ని రంగాల్లోనూ వారికి సమాన అవకాశాలు కల్పించాలనే మాట ప్రతి రాజకీయ నాయకుడి నోటి నుంచి వస్తుంటుంది. రాజ్యాంగం వీరికి 33% రిజర్వేషన్ కల్పించినా ఎంత మంది రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు? ఎంత మంది మహిళా మూర్తులకు మంత్రుల పీఠం దక్కింది? ప్రైవేటు ఉద్యోగాల్లో ఎంత మందికి ఛాన్స్ ఇచ్చారు? వారి హక్కులను వారు పొందినప్పుడే నిజమైన ‘ఉమెన్స్ డే’.
News March 8, 2025
స్త్రీల సలహాలు.. పెడచెవిన పెట్టొద్దు బ్రో!

లేడీస్ సలహా ఇస్తే.. ఆడదానివి నువ్వు చెప్పేదేంటి? అంటున్నారా? ఇకపై అలా అనేముందు ఆలోచించండి. మహిళల సలహాలు వినే పురుషుల ఆలోచనాశక్తి మెరుగ్గా ఉంటుందని ఓ సర్వేలో తేలింది. ‘పురుషులతో పోలిస్తే స్త్రీలు తార్కికంగా, ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తారు. అందువల్ల ఏ సమస్యలోనైనా తమ దృష్టి కోణంతో వారిచ్చే సలహా పురుషులు విస్తృతంగా ఆలోచించేందుకు, తప్పుంటే దిద్దుకునేందుకు ఉపకరిస్తుంది’ అని సర్వే నివేదిక పేర్కొంది.