News September 12, 2024

YCP MP మిథున్ రెడ్డి బర్త్ డే వేడుకల్లో ఉద్రిక్తత

image

AP: రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఉద్రిక్తత నెలకొంది. చిత్తూరు జిల్లా సదుం మండలం పెద్దూరులో జరిగిన ఎంపీ బర్త్ డే వేడుకల సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ గొడవలో పలువురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News

News August 25, 2025

రష్యాలో భారతీయ కార్మికులకు పెరిగిన డిమాండ్!

image

వలసలపై US, UK సహా పాశ్చాత్య దేశాల నుంచి భారతీయులపై ఆంక్షలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు రష్యా కంపెనీలు ముందుకొచ్చినట్లు ఇండియన్ అంబాసిడర్ వినయ్ కుమార్ తెలిపారు. ‘మెషినరీ, టెక్స్‌టైల్స్ రంగాల్లో మన కార్మికులకు డిమాండ్ పెరుగుతోంది. ఇక్కడి చట్టాలకు లోబడి ప్రస్తుతం కంపెనీలు పెద్దఎత్తున మన కార్మికులను హైర్ చేసుకుంటున్నాయి’ అని తెలిపారు.

News August 25, 2025

యాపిల్ ఫోల్డబుల్ ఫోన్‌లో 4 కెమెరాలు!

image

యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో ‘బ్లూమ్‌బర్గ్’ మార్క్ గుర్మన్ అంచనా వేశారు. ‘ఫ్లిప్ కాకుండా యాపిల్ కంపెనీ ఫోల్డబుల్ ఫోన్ బుక్ స్టైల్లో ఉంటుంది. ఇందులో ఫేస్ ఐడీ కాదు టచ్ ఐడీ ఉంటుంది. సీ2 మోడెమ్, 4 కెమెరాలు ఉంటాయి. కేవలం ఈ-సిమ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది’ అని తెలిపారు. దీని ధర రూ.1,74,900 వరకు ఉండొచ్చని, 2026లో విడుదలయ్యే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

News August 25, 2025

మానవ మృగాలు ఫామ్‌హౌస్‌లో ఉన్నాయి: CM రేవంత్

image

TG: ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా OUలో CM రేవంత్ పరోక్షంగా విమర్శలు చేశారు. ‘సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఏనుగులు ఉన్నాయని అభివృద్ధి కాకుండా అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఏనుగులు, సింహాలు లేవు. కేవలం మానవ రూపంలో ఉన్న మృగాలే ఉన్నాయి. అవి కూడా ఫామ్‌హౌజ్‌లో ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలు వేయండి. లేని ఏనుగులు, సింహాలను నేను చంపేస్తున్నానని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు’ అని రేవంత్ మండిపడ్డారు.